తెలంగాణలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఫ్రీగా వాక్సినేషన్ ఇస్తామని నిన్న సీఎం కెసిఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై షర్మిల సిఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. “చావు భయంతో చస్తున్న ప్రజలను అప్పులపాలు చెయ్యడం అమానుషం. ప్రజల మాట, మా మాట విని అందరికి వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చేందుకు ఒప్పుకున్నందుకు KCR గారికి ధన్యవాదాలు. ఇప్పుడైనా మేల్కొని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి చచ్చి బతికిన వారిని ఆదుకోవాలని సర్కారుకు మా విజ్ఞప్తి.” అంటూ షర్మిల తెలిపారు. ఇక అంతకు ముందు ట్వీట్ లో “ప్రజల ప్రాణాలకంటే విలువైనది ఏదీ లేదు. కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పజెప్పగా లేనిది.. ప్రజలకు ఉచితంగా వాక్సిన్ ఇవ్వడానికి రూ.1000 కోట్లు ఖర్చు చేయలేరా కేసీఆర్ గారూ..? ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రీ వాక్సిన్ ఇవ్వండి సీఎం సారూ..” అంటూ పేర్కొన్నారు.