తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని కోరుతూ వైఎస్ షర్మిల నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15 వ తేదీన ఇందిరాపార్క్ వద్ద దీక్షకు కూర్చున్నారు. అయితే, సాయంత్రం తరువాత పోలీసులు దీక్షను అడ్డుకున్నారు. అక్కడి నుంచి వైఎస్ షర్మిలను లోటస్ పాండ్ లోని తన ఇంటికి చేర్చడంతో అక్కడే ఆమె దీక్షకు దిగారు. ఇంట్లో నుంచే షర్మిల దీక్ష చేస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి మూడు రోజులపాటు దీక్ష చేస్తున్నట్టు ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మం సభలో పేర్కొన్నారు. చెప్పిన విధంగానే ఆమె దీక్షకు దిగడంతో రాజకీయాల్లో కలకలం రేగింది. చెప్పిన విధంగానే తాను మూడు రోజులపాటు దీక్ష చేసి తీరుతానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కాగా, ఈరోజు రెండో రోజు. లోటస్ పాండ్ నుంచే దీక్ష చేస్తున్నారు. లోటస్ పాండ్ లోని తన ఇంటి నుంచే చేస్తున్న దీక్షను పోలీసులు అడ్డుకుంటారా లేదా చూడాలి.