ఏప్రిల్ 9 వ తేదీన షర్మిల కొత్త పార్టీని స్థాపిస్తున్నట్టు ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పేర్కోన్న సంగతి తెలిసిందే. పార్టీని ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల నాయకులతో చర్చించారు. నాయకుల, వైఎస్ఆర్ అభిమానుల సలహాలు సూచనలు, అభిప్రాయాలు తీసుకున్నారు. జూన్ నెలలో పార్టీ పేరు, అజెండాను ప్రకటిస్తామని వైఎస్ షర్మిలా పేర్కోన్న సంగతి తెలిసిందే. ఇక, ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల రేపు గజ్వేల్ నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను వైఎస్ షర్మిల కలవబోతున్నారు. రేపు ఉదయం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద నివాళులు అర్పించినల తరువాత గజ్వేల్ కి వెళ్లనున్నట్టు సమాచారం.