NCP Crisis: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పరిణామాలు మహారాష్ట్రలోనే కాక, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పార్టీ చీఫ్ శరద్ పవార్ కి షాక్ ఇస్తూ అజిత్ పవార్ అసమ్మతి గళమెత్తారు.
NCP Poster War: అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. బుధవారం ముంబైలో జరిగిన సమావేశంలో ఆయన తన మామ శరద్ పవార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు అజిత్ పవార్ కూడా పార్టీ పేరు, చిహ్నంపై దావా వేశారు.
ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు జాతీయ పార్టీలో చేరిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్థానంలో ఉండవచ్చని ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ బుధవారం అన్నారు.
మహారాష్ట్రలో ఎన్‌సీబీ సంక్షోభం నేపథ్యంలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు తమ బలాన్ని ప్రదర్శించడానికి కీలక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ముంబైలోని బాంద్రాలో అజిత్ పవార్ శిబిరం సమావేశం జరుగుతుండగా.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శిబిరం సమావేశం ముంబైలోని వైబీ చవాన్ సెంటర్‌లో జరుగుతోంది.
NCP Crisis: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) రాజకీయంలో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్ గా వ్యవహారం నడుస్తోంది. ఎన్సీపీ పార్టీలో అజిత్ పవార్ చీలిక తీసుకువచ్చారు. అజిత్ పవార్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కు షాక్ ఇస్తూ.. బీజేపీ-షిండే ప్రభుత్వంలో చేరారు. ఆయన ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు మరో 8మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రభుత్వంలో చేరారు.
Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ చర్చనీయాంశం అయింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ తిరుగుబాటు దేశవ్యాప్తంగా హైలెట్ అయింది.
NCP Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ప్రధానాంశంగా మారింది. ఆదివారం ఆ పార్టీ కీలక నేత అజిత్ పవార్ ఎన్డీయే ప్రభుత్వంలో చేరడం సంచలనంగా మారింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఆదివారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనందుకు ముగ్గురు పార్టీ నేతలను తొలగించారు.
గత 24 గంటల్లో మహారాష్ట్ర రాజకీయాలు చాలా మలుపులు తిరిగాయి. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పగ్గాలు చేపట్టారు. సోమవారం సతారాలో విలేకరుల సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అయితే సమయం వచ్చినప్పుడు అందరూ నా వెంటే ఉంటారని శరద్ పవార్ స్పష్టం చేశారు. మరోవైపు నేటి నుంచి మార్పు మొదలవుతుందని, ఎన్సీపీ మరింత పటిష్టంగా ముందుకు సాగుతుందని, ప్రజల మద్దతు తమకు ఉంటుందని శరద్…