NCP Crisis: మహారాష్ట్రలో ఎన్‌సీబీ సంక్షోభం నేపథ్యంలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు తమ బలాన్ని ప్రదర్శించడానికి కీలక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ముంబైలోని బాంద్రాలో అజిత్ పవార్ శిబిరం సమావేశం జరుగుతుండగా.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శిబిరం సమావేశం ముంబైలోని వైబీ చవాన్ సెంటర్‌లో జరుగుతోంది. అజిత్ పవార్ క్యాంప్ ఏర్పాటు చేసిన సమావేశానికి 29 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే 40 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆ వర్గం ప్రకటించింది. శరద్ పవార్ శిబిరం విషయానికొస్తే, ఆయన సమావేశానికి ఇప్పటివరకు 13 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశం తర్వాత ఈరోజు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించే అవకాశాన్ని అజిత్ పవార్ శిబిరం పరిశీలిస్తోందని, ఎన్సీపీ పార్టీ పేరు, గుర్తుపై దావా వేయాలని భావిస్తున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు శరద్ పవార్ శిబిరం కూడా ఎన్నికల సంఘానికి కేవియట్ దాఖలు చేసింది.
Also Read: Tis Hazari Court: కోర్టు ప్రాంగణంలో కాల్పులు.. న్యాయవాదుల మధ్య వాగ్వాదం కారణంగా ఘటన
అజిత్ పవార్ వర్గం నాయకుడు ఛగన్ భుజ్‌బల్ బుధవారం నాడు 40 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. ఎందుకంటే ప్రత్యర్థి వర్గాలు పార్టీపై నియంత్రణను కోరుకుంటున్నాయి. బాంద్రాలోని ముంబై ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పిలిచిన సమావేశంలో భుజ్‌బల్ విలేకరులతో మాట్లాడుతూ.. 40 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాతో ఉన్నారన్నారు.. ప్రమాణ స్వీకారానికి ముందు తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
అజిత్ పవార్ మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వంలో చేరడంతో ఆదివారం ఎన్సీపీలో చీలిక వచ్చింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు సమర్పించింది. ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ పవార్, ఛగన్ భుజ్‌బల్‌లతో పాటు దిలీప్ పాటిల్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండో, ధర్మరావుబాబా ఆత్రమ్, అదితి తట్కరే, సంజయ్ బన్సోడే, అనిల్ పాటిల్ ఆదివారం ఏకనాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు.శరద్ పవార్ తన సన్నిహితుడు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పార్టీ నుండి తొలగించారు. రాజ్యసభ ఎంపీ అయిన ప్రఫుల్ పటేల్ పవార్‌కు సన్నిహితుడు. గత నెలలో ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. పవార్‌తో పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇద్దరు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఆయనకు లేఖ రాశారు.