NCP Crisis: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పరిణామాలు మహారాష్ట్రలోనే కాక, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పార్టీ చీఫ్ శరద్ పవార్ కి షాక్ ఇస్తూ అజిత్ పవార్ అసమ్మతి గళమెత్తారు. ఇప్పటికే ఆయన బీజేపీ-శివసేన(ఏక్‌నాథ్ షిండే) ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు మరో 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రభుత్వంలో చేరారు. ఇదిలా ఉంటే నిన్న జరిగిన పోటాపోటీ సమావేశాల్లో అజిత్ పవార్ వర్గానికి 36 మంది ఎమ్మెల్యేలు, శరద్ పవార్ వర్గానికి 13 మంది మద్దతు తెలిపారు. మహారాష్ట్రలో ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
Read Also: India: భారత్‌లో మధ్య తరగతి పెరుగుతోంది.. 2031 నాటికి సగానికి తగ్గనున్న నిరుపేదలు..
ఇదిలా ఉంటే ఈ రోజు శరద్ పవార్ ఢిల్లీ వేదికగా కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్శహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే ఢిల్లీకి వెళ్లారు. మరోవైపు ఎన్సీపీలో పోస్టర్ల యుద్ధం మొదలైంది. శరద్ పవార్ కి మద్దతుగా ‘బాహుబలికి కట్టప్ప వెన్నుపోటు పోడిచాడంటూ’.. అజిత్ పవార్ పై బ్యానర్ల వెలిశాయి. భారతదేశ చరిత్ర ద్రోహం చేసిన వారిని ఎన్నటికీ క్షమించనిది స్లోగన్స్ పోస్టర్లలో కనిపించాయి. ఢిల్లీలో శరద్ పవార్కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున పోస్టర్లు వేశారు.
నిన్న జరిగిన సమావేశాల్లో అజిత్ పవార్ మాట్లాడుతూ.. శరద్ పవార్ రిటైర్ కావాలని కోరారు. తాను ముఖ్యమంత్రిని కావాలనే ఆశను వెల్లడించారు. ప్రస్తుతం పార్టీ పేరు, గుర్తును దక్కించుకునే పనిలో అజిత్ పవార్ వర్గం ఉంది. దీనికి సంబంధించి న్యాయపరమైన అంశాలను చర్చిస్తోంది. మరోవైపు తనకు మద్దతుగా సంతకాలు చేసిన ఎమ్మెల్యేలను అజిత్ వర్గం హోటళ్లకు తరలిస్తోంది. గతంలో శివసేనలో వచ్చిన తిరుగుబాటు లాగే ప్రస్తుతం ఎన్సీపీలో తిరుగుబాటు మొదలైంది.
Delhi | Amid NCP vs NCP crisis in Maharashtra, Rashtrawadi Vidyarthi Congress puts up a poster designed on a scene from the film 'Baahubali – The Beginning', showing its character 'Kattappa' stabbing 'Amarendra Baahubali' in the back. pic.twitter.com/ojq7EmXO7A
— ANI (@ANI) July 6, 2023