మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ గందరగోళం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చీలిక తర్వాత జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ ఢిల్లీలో కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎనిమిది తీర్మానాలను ఆమోదించారు. ఇందులో అజిత్ పవార్ సహా 9 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శరద్ పవార్‌ను కలిశారు.
Also Read: YSRCP Leader Murder Case: వైసీపీ నేత హత్య కేసు.. టీడీపీ నేత అరెస్ట్..
అయితే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. కాంగ్రెస్ మీడియా సమావేశం ఒకేసారి నిర్వహించారు.. విషయం తెలుసుకున్నా.. రాహుల్ గాంధీ అకస్మాత్తుగా తన ప్రెస్ మీట్ ను రద్దు చేసుకుని అక్కడి నుంచి వెంటనే శరద్ పవార్‌ను కలిసేందుకు బయలుదేరారు. రాహుల్ గాంధీ శరద్ పవార్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. దీంతో రాహుల్ గాంధీకి జితేంద్ర అవద్ స్వాగతం పలికారు. ఈ భేటీలో ఎన్సీపీలో తిరుగుబాటు, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
Also Read: No Fly Zone : నో ప్లై జోన్లుగా వరంగల్, హనుమకొండ ప్రాంతాలు
జాతీయ కార్యవర్గం శరద్ పవార్‌పై విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో ఎన్సీపీ కార్యవర్గం 8 తీర్మానాలను ఆమోదించింది. పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌పై కమిటీ పూర్తి నమ్మకం వ్యక్తం చేసింది. అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, ఎన్డీయేతో చేతులు కలిపిన 9 మంది ఎమ్మెల్యేలను బహిష్కరిస్తూ శరద్ పవార్ తీసుకున్న నిర్ణయాన్ని ఎన్సీపీ కార్యవర్గం ఆమోదించింది.
Also Read: Eesha Rebba: ఎవరి కోసం పాప.. గుమ్మం ముందు అంతలా ఎదురుచూస్తున్నావ్
ఎన్సీపీలో చీలిక తర్వాత ఇద్దరు నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి. అంతకుముందు పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో రాహుల్ గాంధీ, శరద్ పవార్ సమావేశమయ్యారు. ఈ భేటీపై శరద్ పవార్ వర్గం నేత జితేంద్ర అవద్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ తమను కలవడానికి వచ్చారని అన్నారు. అందరం కలిసికట్టుగా ఉన్నామని భరోసా ఇచ్చారు. మన దగ్గర అన్నీ ఉన్నాయి.. కొంత మంది వెళ్లినా పర్వాలేదు అని శరవ్ పవార్ కు రాహుల్ గాంధీ ధైర్యం చెప్పారని జితేంద్ర అవద్ అన్నారు. లెజిస్లేచర్ పార్టీ విచ్ఛిన్నమైతే ఆ పార్టీలో చీలిక వచ్చిందని కాదు అని ఆయన తెలిపారు.