Sharad Pawar: తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ మోడల్ పాలనను విస్తరించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ చేశారు. తెలంగాణను అనుకుని ఉన్న సరిహద్దు మహారాష్ట్ర గ్రామాలు తెలంగాణలో అమలు చేస్తునటువంటి పథకాలు తమకు కూడా కావాలని డిమాండ్ చేస్తున్నారు.
National Politics: రాజకీయాలలో శరద్ పవార్ అనుభవజ్ఞుడు.. రాజకీయంగా ఎప్పుడు ఎలాంటి ఎత్తుగడ వేసినా చాలా జాగ్రత్తగా ఉంటాడు. మరోసారి అతను అలాంటిదే చేశాడు, ఇది అతని మేనల్లుడు అజిత్ పవార్ ఊహించలేదు.
Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ను చంపేస్తామంటూ ఇటీవల సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం తన తండ్రి శరద్ పవార్ వాట్సాప్ లో బెదిరింపు సందేశాలు వచ్చినట్లు కుమార్తె సుప్రియా సూలే చెప్పారు. శరద్ పవార్ భద్రత బాధ్యత హోం శాఖపై ఉందని, అమిత్ షా జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. మహారాష్ట్ర హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి ఈ విషయంలో కలుగజేసుకోవాలని ఆమె కోరారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను ఆపేయాలంటూ…
NCP: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శనివారం కీలక ప్రకటన చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను నియమించారు. సుప్రియా సూలే, శరద్ పవార్ కుమార్తె, ప్రస్తుతం ఈమె బారామతి నుంచి ఎంపీగా ఉన్నారు. పార్టీ 25వ వార్షికోత్సవంలో శరద్ పవార్ ఈ విషయాన్ని ప్రకటించారు.
పార్లమెంట్ సంబంధిత వ్యవహారాలపై చర్చ చాలా ముఖ్యమని, కానీ రాను రాను ఈ సంప్రదాయం క్షీణిస్తోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. నూతన పార్లమెంటు భవనం గురించి రాజకీయ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందని ఆయన అన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ( ఎన్సీపీ ) అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. దీంతో ఒక్కసారి ఈ విషయం పొలిటికల్ సర్కిల్ లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం ముంబైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో సమావేశం కానున్నారు.
Sharad Pawar: విపక్షాల ఐక్యత కోసం దేశంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్న వస్తోంది. తాజాగా దీనిపై స్పందించారు శరద్ పవార్. తాను ప్రధాన మంత్రి రేసులో లేనని ప్రకటించారు.
Karnataka CM swearing-in ceremony: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 224 స్థానాల్లో ఏకంగా 135 స్థానాలను గెలుచుకుంది. అయితే గెలిచిన తర్వాత సీఎం పీఠం కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ ఎదురైంది. నాలుగు రోజుల హస్తినలో చర్చల తర్వాత సిద్దరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ప్రకటించింది. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించింది. మే 20న బెంగళూర్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.