Shah Rukh Khan Announces His Own OTT Platform Name. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇటీవల కాలంలో భాషాతీతంగా ఓటీటీలో చిన్న సినిమాల మొదలు భారీ సినిమాల వరకూ రిలీజ్ అయ్యాయి. దీనివల్ల థియేటర్ల మనుగడకు కూడా ప్రమాదం ఏర్పడింది. ఇక ఈ ఊపులో పలు కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. అలా ప్రాంతీయభాషల్లోనూ పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పుట్టుకు వచ్చాయి. ఇది గమనించే కాబోలు…
బాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ కు కొదవలేదు. ఇద్దరు ముగ్గురు సూపర్ స్టార్స్ కూడా ఎలాంటి ఇగోలేకుండా హ్యాపీగా సినిమాల్లో నటిస్తుంటారు. చేస్తోంది హీరో పాత్ర, విలన్ పాత్ర అనేది కూడా చూసుకోరు. అంతేకాదు… స్టోరీ నచ్చాలే కానీ నిడివికి కూడా ప్రాధాన్యం ఇవ్వరు. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు టూ హీరో మూవీస్ తెరకెక్కుతున్నాయి. అయితే అందులో నాలుగు సినిమాలు మాత్రం ట్రెండింగ్ అవుతున్నాయి. అందులో మొదటిది ‘పఠాన్’. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్,…
కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. మూడు వారాల జైలు జీవితం గడిపిన ఆర్యన్ ఆ తరువాత బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే ఈ విషయంపై తాజాగా ఓ మలయాళ స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మిన్నాల్ మురళీ’గా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న టోవినో థామస్ తాజాగా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై స్పందించారు. ఇది షారుఖ్ ఖాన్…
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్. ఆమె ఇంకా బాలీవుడ్ గ్లామరస్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ సుహానన్ తన సిజ్లింగ్ లుక్స్, ట్రెండీ దుస్తులతో ఇప్పటికే భారీ అభిమానులను సంపాదించుకోగలిగింది. అయితే ఆమె ఇంతవరకూ తన వెస్ట్రన్, ఇన్-ట్రెండ్ ఫ్యాషన్ దుస్తులతో అభిమానులను అలరించింది. కానీ ఇప్పుడు మాత్రం అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ ఎథెనిక్ దుస్తువుల్లో కన్పించింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్…
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో కన్నుమూసిన విషయం తెలిసిందే. యావత్ దేశం ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తోంది. లతా మంగేష్కర్ మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పొచ్చు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి అభిమానులు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న సాయంత్రం చేసిన ఆమె అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ఆ జాబితాలో షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. లతాజీకి…
భారతదేశపు నైటింగేల్ లతా మంగేష్కర్ ఆదివారం మనందరినీ విడిచి పెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. లతా మంగేష్కర్ మరణం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను శోకసంద్రంలో ముంచేసింది. ఈ లెజెండరీ సింగర్ కు కడసారి నివాళులు అర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పటు రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు కూడా నిన్న ఆమె ఇంటికి చేరుకున్నారు. చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్ కూడా లతా మంగేష్కర్కు చివరిసారి వీడ్కోలు పలికేందుకు వచ్చారు. అయితే…
‘జీరో’ మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొద్ది రోజులు నటనకు దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కింగ్ ఖాన్ ‘పఠాన్’ మూవీ చేస్తున్నాడు. దీనితో పాటు షారుఖ్ ఖాన్.. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మూవీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా షూటింగ్ ఈ యేడాది మార్చిలో ముంబైలో మొదలవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం…
బాలీవుడ్ కింగ్ లేదా షారుఖ్ ఖాన్ బంగ్లా మన్నత్ ను బాంబుతో పేల్చివేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి పేరు జితేష్ ఠాకూర్. 2022 జనవరి 6న జితేష్ మహారాష్ట్ర పోలీస్ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి, షారూఖ్ బంగ్లాను బాంబుతో పేల్చివేస్తానని చెప్పాడు. ఇందులో షారుక్ బంగ్లాతో పాటు ముంబైలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు, బాంబు పేలుళ్లు చేస్తామని బెదిరించాడు. ముంబై…
ప్రపంచంలో అత్యంత ఆరాధించబడే టాప్-20 పురుషుల జాబితాలో విరాట్ కోహ్లి చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో కోహ్లి 18వ స్థానంలో నిలిచాడు. అయితే కోహ్లీ కంటే ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఈ జాబితాలో మోడీ 8వ స్థానంలో నిలవగా… ఎప్పుడో క్రికెట్ ను వదిలేసిన సచిన్ 12 వ స్థానంలో ఉన్నాడు. అలాగే షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్…