సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ నయనతార మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా తన అభిమానులను అలరించబోతోందట. ఇటీవల షూటింగ్ ప్రారంభించిన షారుఖ్ ఖాన్ చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది నయన్. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా “లయన్” అనే టైటిల్ పెట్టారు. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నయనతార ఇన్వెస్టిగేటివ్ పోలీస్ పాత్రలో నటించనుందని టాక్. ఆ పాత్రకు నయనతారనే…
ముంబైలోని నటుడు షారూఖ్ ఖాన్ నివాసం మన్నత్ దీపావళికి ముందు దీపాలతో అలంకరించారు. దీనికి కారణం లేకపోలేదు. అతని కుటుంబం వేడుక చేసుకోవడానికి మరొక కారణం కూడా ఉంది. ఆర్థర్ రోడ్ జైలు నుంచి అతని కుమారుడు ఆర్యన్ ఖాన్ విడుదలయ్యారు. ఆర్యన్‌తో పాటు మరో ఏడుగురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అక్టోబర్ 2న ముంబైలోని ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ నుండి అరెస్టు చేసింది. డ్రగ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలో…
డ్రగ్స్ కేసులో దాదాపు 26 రోజులు జైలులో గడిపిన ఆర్యన్ ఖాన్ ఈరోజు బెయిల్ పై విడుదలై జైలు నుంచి బయటకు వచ్చారు. ఆర్యన్ తో పాటు ఆయన స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, మోడల్ మున్మున్ ధమేచా కూడా ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చారు. క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసులో వీరందరినీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అక్టోబర్ 3న అరెస్టు చేసింది. ముగ్గురిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసు…
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తాజాగా జైలు నుంచి విడుదల అయ్యాడు. షారుఖ్ ఖాన్, గౌరీ కుమారుడు త్వరలో మన్నత్ చేరుకోనున్నారు. కాసేపటి క్రితమే ఆర్యన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేసే ప్రక్రియ పూర్తయింది. షారుఖ్ తన కుమారుడిని జైలు నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి జైలుకు చేరుకున్నాడు. ఆర్యన్ బయటకు రాగానే అతన్ని బాడీగార్డ్ వెంటనే కారులోకి పంపాడు. ఆర్యన్ తో పాటు మరో ఇద్దరు నిందితులు అర్బాజ్ మర్చంట్,…
డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో మూడు వారాల పాటు జైలు జీవితం గడిపిన సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఈరోజు జైలు నుంచి బయటకు రానున్నారు. నిన్న ఆయన బెయిల్ పత్రాలు స్వీకరణకు గడువు ముగియడంతో మరో రాత్రి ఆర్యన్ జైలులో గడపవలసి వచ్చింది. ఆర్యన్ ఖాన్ అక్టోబరు 2న క్రూయిజ్ షిప్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడి చేసిన తర్వాత అరెస్టయి, దాదాపు ఒక నెల జైలు జీవితం గడిపాడు.…
ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు గురువారం బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. అయితే ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చిన తర్వాత షారూఖ్ ఖాన్ తన న్యాయవాద బృందాన్ని కలిశారు. షారూఖ్, అతని లీగల్ టీమ్ కెమెరాను చూసి నవ్వుతూ కనిపిస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం మేరకు ఆర్యన్ కు బెయిల్ రావడంపై సంతోషం వ్యక్తం చేసిన షారుఖ్…
దీపావళికి పది రోజుల ముందు చాక్లెట్ కంపెనీ క్యాడ్బరీ కొత్త ప్రకటనతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించారు. ఈ దీపావళికి స్థానిక దుకాణాల నుండి వస్తువులను కొనుగోలు చేయాలని ఈ ప్రకటనలో క్యాడ్బరీ తన వీక్షకులకు విజ్ఞప్తి చేసింది. ‘కోవిడ్ సమయంలో నష్టపోయిన పెద్ద వ్యాపారాలు, బ్రాండ్లు మళ్ళీ పుంజుకున్నాయి. కానీ చిన్న దుకాణాలు ఇప్పటికీ బాధపడుతున్నాయి’ అని ప్రారంభమయ్యే ఈ యాడ్ 2.18 నిమిషాలు ఉంది. అందులోనే…
చార్ ధామ్ ఆధ్యాత్మిక యాత్ర ముగించుకుని వచ్చిన సమంత వృత్తిగత జీవితంలో ఫుల్ బిజీ అయింది. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్ లు సైన చేస్తున్న సమంత తాజాగా షారూఖ్, అట్లీ సినిమాలోనూ నటించబోతోందట. ఇందులో నయనతార స్థానంలో సమంతను ఎంపిక చేసినట్లు వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాలో ముందు సమంతనే అనుకున్నాడు అట్లీ. అయితే అప్పట్లో సంసారజీవితంలో బిజీగా కావాలనుకున్న సమంత ఆ ఆఫర్ ని అంగీకరించలేదు. ఆ తర్వాత అట్లీ షారూఖ్ సరసన నయనతారను హీరోయిన్…
ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతోంది. బెయిల్ వస్తుందా? రాదా? అనేది హిందీ పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి. ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ తనయుడైన ఆర్యన్ ఖాన్ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబై ఆర్ధర్ రోడ్ జైల్లో ఉన్నాడు ఆర్యన్ ఖాన్. అక్టోబర్ 2న అరెస్టైన ఆర్యన్ ఖాన్‌కు బెయిల్…
బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గత 14 రోజుల నుండి ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. నిన్న కోర్టులో విచారణకు వచ్చిన ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ను ధర్మాసనం తిరస్కరించింది. అయితే తాజాగా ఎన్సీబీ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇంటిపై దాడులు చేయడం ఆసక్తికరంగా మారింది. నటుడు చుంకి పాండే కూతురు, అనన్య పాండే బాంద్రాలో నివాసం ఉంటున్న ఇంటిపై నార్కోటిక్స్ బ్యూరో కంట్రోల్…