కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. మూడు వారాల జైలు జీవితం గడిపిన ఆర్యన్ ఆ తరువాత బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే ఈ విషయంపై తాజాగా ఓ మలయాళ స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మిన్నాల్ మురళీ’గా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న టోవినో థామస్ తాజాగా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై స్పందించారు. ఇది షారుఖ్ ఖాన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాజకీయంగా చేసిన పని అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘నారదన్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన టోవినో ఈ డ్రగ్స్ కేసు వెనుక షారుఖ్, ఆయన తనయుడి ప్రతిష్టను దిగజార్చజడమే రాజకీయ ఉద్దేశ్యం అని అనిపిస్తోందని అన్నారు.
Read Also : Manchu Vishnu: గాలి నాగేశ్వరరావు గా మారిన ‘మా’ ప్రెసిడెంట్
మరోవైపు టోవినో థామస్ నటించిన “నారదన్” మూవీ మార్చి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఇందులో ఆయన జర్నలిస్ట్ పాత్రలో కన్పించాడు. ఆషిక్ అబు దర్శకత్వంలో ఉన్ని ఆర్ రచించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.