Deepika Padukone బాలీవుడ్ లోని టాప్ హీరోయిన్లలో ఒకరు. తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపికా పదుకొనె కొత్త చిత్రంలోని ఆన్ సెట్స్ ఫోటోలు లీక్ అయ్యాయి. లీకైన చిత్రాలలో దీపికా నియాన్ పసుపు హాల్టర్‌నెక్ బికినీని ధరించి బోల్డ్‌గా, అందంగా కనిపించారు. అందులో ఆమె స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు వస్తూ కనిపిస్తుంది. అలాగే ఇతర ఫోటోలలో దీపికను బ్లాక్ ప్రింటెడ్ బికినీ టాప్‌లో ర్యాప్-అరౌండ్ స్కర్ట్ ధరించి అద్భుతమైన లుక్‌లో కన్పించింది.
Read Also : Rajamouli : మహేష్ ఒకే ఒక్కడు… SSMB29పై క్లారిటీ
ఇక ప్రస్తుతం దీపికా ‘పఠాన్’ అనే సినిమాలో నటిస్తోంది. షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా సెట్స్ నుంచి షారుఖ్ ఖాన్ పిక్ లీకైన విషయం తెలిసిందే. ఇప్పుడు దీపికా ఫోటోలు లీకై ఇంటర్నెట్‌లో తుఫానుగా మారాయి. కాగా దీపికా సినిమాల విషయానికొస్తే సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో వస్తున్న “ఫైటర్” సినిమాలో హృతిక్ తో జతకడుతోంది. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు “ప్రాజెక్ట్ కే”లో జోడిగా కనిపించనుంది.