World Cup: భారత మహిళ క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే వరల్డ్ కప్‌ను సాధించింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఓడించింది. అయితే, ఈ విజయం ఎఫెక్ట్‌లో మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం వస్తున్న రిపోర్టుల ప్రకారం, బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజులు ఏకంగా 25 శాతం నుంచి 100 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది.
Women’s World Cup Final: నవీ ముంబైలో ఆదివారం భారతీయుల కలను టీమిండియా మహిళా జట్టు నిజం చేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ODI ప్రపంచ కప్‌ను ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి ముద్దాడింది. అనంతరం నాలుగు సంవత్సరాల క్రితం రూపొందించిన జట్టు పాటను హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం మైదానంలో ఆవిష్కరించారు. ఆటగాళ్లు, జట్టు సహాయక సిబ్బంది, ఇతర సభ్యులు ఆనందోత్సాహాలతో పాటను హృదయపూర్వకంగా పాడారు. ఈ సందర్భంగా భారత సెమీఫైనల్ హీరో…
ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా తోడుంటేనే విజయం సాధిస్తారు అని అంటుంటారు. భారత మహిళా జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ విషయంలో ఇదే జరిగింది. 21 ఏళ్ల షఫాలీ భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో బ్యాట్, బంతితో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇచ్చి.. భారత జట్టు 52 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ముందు కూడా చర్చించబడని షఫాలీ…
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్ ఓటమిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ స్పందించారు. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకున్న నిర్ణయమే తమ కొంప ముంచిందని తెలిపారు. షెఫాలీ వర్మ బౌలింగ్ ఇలా ఉంటుందని తాము అస్సలు ఊహించలేదని, మాకు ఆమె బిగ్ సర్‌ప్రైజ్ అని చెప్పారు. ప్రపంచకప్ ఫైనల్‌లో పార్ట్ టైం బౌలర్లకు వికెట్లు ఇవ్వడం సరికాదని వోల్వార్డ్ పేర్కొన్నారు. ఫైనల్లో షెఫాలీ 87 పరుగులు చేసి, రెండు కీలక వికెట్లు…
2025 ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు తొలిసారిగా మహిళల ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ఆదివారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు భారత్ 299 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్‌లో ప్రొటీస్ 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2005, 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది.…
Shafali-Deepthi: భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్లో భారత్ చారిత్రక విజయాన్ని అందుకుని.. తమ తొలి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. నవి ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయానికి ఇద్దరు యువ క్రీడాకారిణులు షఫాలీ వర్మ, దీప్తి శర్మల ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కీలకంగా నిలిచారు.…
Womens World Cup 2025 : ఏదైనా మనస్పూర్తిగా కోరుకుంటే, ఆ కల నిజమవుతుందంటారు. మనసు, కృషి, పట్టుదలతో ప్రయత్నిస్తే విశ్వం కూడా కలసి పనిచేస్తుందంటారు. ఆ నమ్మకాన్ని నిజం చేసింది భారత మహిళా క్రికెట్ జట్టు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆ కల.. ఇప్పుడు సాకారం అయింది. అయితే ఈ విజయం అంత సులభంగా రాలేదు. గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు ఓడిపోయి జట్టు పయనం కాస్త సంక్లిష్టమైంది. కానీ ఆ ఒత్తిడిని అవకాశంగా మలచి, తర్వాతి…
Ind vs Aus: నవి ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా మహిళల జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా భారత జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో భారత ఓపెనర్లు స్మృతి మంధనా, షఫాలి వర్మ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు…
Shafali Verma: మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో జరగనున్న సెమీఫైనల్ పోరుకు ముందు భారత జట్టు శిక్షణ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన యువ సంచలనం షఫాలీ వర్మ తాజాగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరిగిన శిక్షణా సెషన్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఓపెనర్ ప్రతీక రావల్ కాలు, మోకాలి గాయాల కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో సోమవారం…
WPL 2025: శుక్రవారం జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి మాజీ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మొదట బౌలింగ్ చేసిన ఢిల్లీ జట్టు, సీజన్ వన్ విజేత ముంబై ఇండియన్స్‌ను తొమ్మిది వికెట్లకు 123 పరుగులకే పరిమితం చేసింది. జోనాస్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టింది.…