Shafali Verma: భారత మహిళా క్రికెటర్ షఫాలి వర్మ (Shafali Verma) నవంబర్ 2025 నెలకు ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ICC Women’s Player of the Month) అవార్డును దక్కించుకుంది. నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఆమె చూపిన మ్యాచ్‌ను నిర్ణయించిన ప్రదర్శనకు ఈ గౌరవం లభించింది. ఫైనల్ మ్యాచ్‌లో షఫాలి టాప్ ఆర్డర్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి 87 పరుగులు చేసింది. స్మృతి మంధానతో కలిసి తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇది ఆమె వన్డే కెరీర్‌లో అత్యధిక స్కోరు కాగా, మూడేళ్లకు పైగా తర్వాత వచ్చిన తొలి అర్ధశతకం కావడం విశేషం.
Anil Ravipudi : తనపై వస్తున్న ‘క్రింజ్ డైరెక్టర్’ కామెంట్స్ పై అనిల్ రావిపూడి వివరణ
బ్యాటింగ్‌తోనే కాదు, బౌలింగ్‌లోనూ షఫాలి కీలక పాత్ర పోషించింది. 7 ఓవర్లలో 36 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీసి దక్షిణాఫ్రికా కీలక బ్యాటర్లు సునే లూస్, మారిజానే కాప్‌లను పెవిలియన్‌కు పంపింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ఆమెకు బంతిని అప్పగించాలన్న నిర్ణయం భారత్‌కు కీలకంగా మారింది. ఫలితంగా దక్షిణాఫ్రికా జట్టు 246 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంలో భారత్ 52 పరుగుల తేడాతో గెలిచి, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. స్వదేశీ ప్రేక్షకుల ముందే వరల్డ్ కప్ గెలవడం భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.
అవార్డు అందుకున్న అనంతరం షఫాలి స్పందిస్తూ.. “నా తొలి వరల్డ్ కప్ అనుభవం ఆశించిన విధంగా మొదలుకాలేదు. కానీ, చివరికి నేను ఊహించనంత గొప్ప ముగింపు లభించింది. ఫైనల్‌లో జట్టు విజయంలో భాగస్వామ్యమయ్యే అవకాశం రావడం నా అదృష్టం. ఈ అవార్డును నా సహచరులు, కోచ్‌లు, కుటుంబ సభ్యులు, నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నాను. మేము జట్టుగా గెలుస్తాం, జట్టుగా ఓడిపోతాం.. ఈ అవార్డు కూడా అంతే” అని తెలిపింది.
CMR Shopping Mall: రాజాంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ 44వ స్టోర్ ఘన ప్రారంభం..
వరల్డ్ కప్‌లో షఫాలి ప్రయాణం సులభంగా ఏమి లేదు. టోర్నమెంట్ ప్రారంభంలో జట్టులో చోటు దక్కకపోవడం, తరువాత యస్తిక భాటియా స్థానంలో ఉమా చేత్రీకి అవకాశం ఇవ్వడంతో మరోసారి నిరాశ ఎదురైంది. కానీ, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ప్రతికా రావల్ గాయపడడంతో ఆమెకు మళ్లీ అవకాశం లభించింది. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై కేవలం 10 పరుగులే చేసినా, ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో అసలైన హీరోగా నిలిచింది. ముందు షఫాలి శ్రీలంకతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొననుంది. ఈ సిరీస్ డిసెంబర్ 21 నుంచి విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. అలాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా ఆమె ఆట కొనసాగించనుంది.
Flamboyant India batter claims the ICC Women’s Player of the Month award for November 2025 after a crucial all-round performance in the #CWC25 final 💪
More 👉 https://t.co/IC1CZKBHvQ pic.twitter.com/mVQEJdP1Y5
— ICC (@ICC) December 15, 2025