Today Stock Market Roundup 28-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని అద్భుతమైన ఫలితాలతో ముగించింది. చివరి రోజైన ఇవాళ శుక్రవారం రెండు కీలక సూచీలు అనూహ్యంగా అత్యధిక విలువలను అందుకోవటం విశేషం. విదేశీ మరియు స్వదేశీ కొనుగోళ్లు కలిసొచ్చాయి. రిలయెన్స్, ఐటీసీ, కొటక్, ఎస్‌బీఐ, ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి సంస్థలు రాణించాయి.
Today Stock Market Roundup 16-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం తీవ్ర ఊగిసలాటకి గురైంది. ఈ వారంలో మొదటి 3 రోజులు లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిసిన సూచీలు ఈరోజు నష్టాలతో ప్రారంభమై స్వల్ప లాభాలతో క్లోజ్ అయ్యాయి. ఎట్టకేలకు వరుసగా ఐదు రోజుల నుంచి వస్తున్న నష్టాలకు బ్రేక్ పడింది. ఎఫ్‌ఎంసీజీ మరియు బ్యాంకింగ్ సెక్టార్లలోని కొన్ని కంపెనీల షేర్లు బాగా రాణించాయి.
Today (15-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం లేటుగా పుంజుకుంది. దీంతో.. ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం భారీ లాభాల్లోనే ముగిసింది. రెండు కీలక సూచీలు కూడా బెంచ్ మార్క్‌లకు పైనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ చాలా రోజుల తర్వాత 18 వేల పాయింట్లను మించటం విశేషం. రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ర్యాలీ తీయటం కలిసొచ్చింది.
Today (09-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ గురువారం నష్టాలతో ప్రారంభమై లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం జరిగిన లావాదేవీలు బెంచ్ మార్క్ ఇండెక్స్‌లకు లాభాలు పంచాయి. ఐటీ మరియు ఫైనాన్షియల్ షేర్ల అమ్మకాలు దీనికి ఊతంగా నిలిచాయి. ముఖ్యంగా ట్రేడింగ్ చివరి గంటలో బాగా పుంజుకున్నాయి. చివరికి రెండు సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 142 పాయింట్లు పెరిగి 60 వేల 806 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 21…
Today (01-02-23) Stock Market Roundup: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌పై రెండు విధాలుగా వ్యక్తమైంది. సెన్సెక్స్ లాభపడగా.. నిఫ్టీ స్వల్పంగా నష్టపోయింది. రెండు కీలక సూచీలు ఇవాళ బుధవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభం కాగా ఇంట్రాడేలో పెద్దఎత్తున అప్ అండ్ డౌన్స్‌కి గురయ్యాయి. ఫలితంగా.. వరుసగా మూడో రోజు.. సెన్సెక్స్, నిఫ్టీ.. బెంచ్ మార్క్‌లకు దిగువనే ముగిశాయి.
Today (31-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఇవాళ ట్రేడింగ్ మొత్తం అస్థిరంగానే సాగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 7 శాతంతో పోల్చితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతంగానే ఉంటుందని ఎకనమిక్ సర్వే-2023 పేర్కొనటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో 2 కీలక సూచీలు వరుసగా 2వ రోజు అంటే ఇవాళ కూడా బెంచ్ మార్క్‌లకు దిగువనే ముగిశాయి.
Today (18-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు కూడా జోష్ కనిపించింది. ఇవాళ బుధవారం ఉదయం రెండు కీలక సూచీలు ఊగిసలాట ధోరణిలో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం వరకు భారీగా లాభాల బాటలో పయనించాయి. సెన్సెక్స్ ఏకంగా 61 వేల పాయింట్లు అధిగమించింది. నిఫ్టీ 18 వేల పాయింట్లకు పైనే ట్రేడ్ అయింది. ఎంపిక చేసిన ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా బెంచ్‌మార్క్ సూచీలకు లాభాలు కొంత వరకు తగ్గినా…
Today (12-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ సెంటిమెంట్ కరువై నష్టాలతోనే ముగిసింది. ఇవాళ గురువారం ఉదయం రెండు కీలక సూచీలు కూడా మందకొడిగానే ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ కొద్దిసేపటికి స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. కానీ.. ఇంట్రాడేలో నెగెటివ్ జోన్‌లో కదలాడాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానుండటం మరియు క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో ఆ ప్రభావాలు స్టాక్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించాయి.
Today (19-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఈ వారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం ఉదయం రెండు సూచీలు కూడా ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ కాసేపట్లోనే లాభాల బాట పట్టి చివరికి భారీ ప్రాఫిట్స్‌తో ముగిశాయి. సెన్సెక్స్ 468 పాయింట్లు పెరిగి 61 వేల 806 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 157 పాయింట్లు ప్లస్సయి 18 వేల 426 పాయింట్ల వద్ద ముగిసింది.