మీరు ఐఫోన్ వాడుతున్నారా.. అయితే వెంటనే సెక్యూరిటీ అప్ డేట్ చేసుకోండి. ఐఫోన్లలో పెగాసస్ మాల్ వేర్ ను చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు రీసెర్చ్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో యాపిల్ కంపెనీ సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించింది.
బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎక్స్ కేటగిరీగా ఉన్న ఈటల భద్రతను వై ప్లస్ కేటిరీకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రత గురించి మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ కు ఫోన్ చేసి ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఈటల భద్రత విషయంలో సీనియర్ ఐపీఎస్ తో సమీక్షించాలని సూచించారు.
జీ-20 సమావేశంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంటూ, ప్రపంచ ఆహార భద్రతను సాధించేందుకు సమిష్టి చర్యను ఎలా చేపట్టాలనే దానిపై చర్చించాలని జీ-20 వ్యవసాయ మంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
ఒడిశా రైలు ప్రమాదం ఎంతో విషాదం మిగిల్చింది. వందలాది మందికి కుటుంబాలను లేకుండా చేసింది. ఇంతటి విషాదం మిగిల్చిన ప్రమాదాన్ని సైతం కొందరు స్వార్థపరులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
ఢిల్లీ నుంచి శాని ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన విమానం రష్యాలోని మగడాన్‌లో అత్యవసరంగా ల్యాడ్ అయింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా మగడాన్‌లో ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఎయిరిండియా ప్రకటించింది.
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి భద్రతను పెంచాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి 'వై' కేటగిరీ భద్రతను పొందేందుకు అర్హులైన భారత క్రికెట్ మాజీ కెప్టెన్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించనున్నారు.