iPhone: ఐఫోన్ వాడుతున్నారా.. ఇది అప్ డేట్ చేసుకోండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone: మీరు ఐఫోన్ వాడుతున్నారా.. అయితే వెంటనే సెక్యూరిటీ అప్ డేట్ చేసుకోండి. ఐఫోన్లలో పెగాసస్ మాల్ వేర్ ను చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు రీసెర్చ్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో యాపిల్ కంపెనీ సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించింది. దీంతో తమ యూజర్స్ భద్రత కోసం ఓ సెక్యూరిటీ అప్ డేట్ ను విడుదల చేశామని, వెంటనే ఐఫోన్, ఐపాడ్ సహా ఇతర యాపిల్ ఉత్పత్తులను అప్ డేట్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది. ఇది అప్ డేట్ చేసుకుంటే హ్యాకర్ల బారి నుంచి ఐఫోన్లను కాపాడుకోవచ్చని తెలిపింది. ఐఫోన్ సాఫ్ట్ వేర్ లోని కొన్ని లోపాలను గుర్తించినట్లు ఇంటర్నెట్ వాచ్ డాగ్ సిటిజన్ ల్యాబ్ వెల్లడించింది. ఈ లోపాలను ఆధారంగా చేసుకుని వాషింగ్టన్ కు చెందిన ఓ ఉద్యోగి ఫోన్ లోకి పెగాసస్ మాల్ వేర్ ను ప్రవేశపెట్టే ప్రయత్నం జరిగిందని తెలిపింది.
Read Also: Devineni Avinash: అవినీతి చేస్తే అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా
Also Read
- TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
ఎలాంటి లింక్ లతో సంబంధం లేకుండా.. అసలు ఫోన్ యజమాని ఏం చేయకున్నా సరే ఫోన్ లోకి ఈ మాల్ వేర్ చేరుతుందని యాపిల్ కంపెనీ హెచ్చరించింది. ఈ నిఘా ఒకసారి చొరబడితే ఫోన్ లోని కెమెరా ఆన్ కావడం, వాయిస్, ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతాయని, ఫోన్ లోని కీలక సమాచారం హ్యాకర్లకు చేరుతుందని పేర్కొంది. కాగా, ఐఫోన్ సాఫ్ట్ వేర్ లో తాము గుర్తించిన లోపాలను ‘జీరో డే బగ్స్’ గా సిటిజన్ ల్యాబ్ పేర్కొంది. అంటే ఈ లోపాలను సరిదిద్దడానికి ఒక్క రోజు కూడా సమయంలేదని ఆ కంపెనీ వెల్లడించింది. ఐఫోన్లలోని కొన్ని లోపాలను వాడుకొని కొందరు హ్యాకర్లు ఈ విధంగా ఫోన్లలోకి పెగాసస్ స్పైవేర్ ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టెక్ నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?