Odisha Train Accident: నకిలీ డాక్యుమెంట్లతో పరిహారానికి యత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం ఎంతో విషాదం మిగిల్చింది. వందలాది మందికి కుటుంబాలను లేకుండా చేసింది. ఇంతటి విషాదం మిగిల్చిన ప్రమాదాన్ని సైతం కొందరు స్వార్థపరులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను ఉపయోగించుకొని ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం నకిలీ సర్టిఫికెట్లను సమర్పిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారికి రిజర్వేషన్ చేయించుకున్న వారికి, టికెట్ తీసుకున్న వారికి.. చివరికి టికెట్ లేకుండా ప్రయాణించిన వారికి సైతం నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కొందరు దురాశాపరులు తమ చేతివాటం చూపిస్తున్నారు.
Read also: Lifestyle : పెళ్లయిన మగవాళ్ళు వేరే స్త్రీలను ఎందుకు ఇష్ట పడతారో తెలుసా?
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
ఒడిషా ప్రమాదం 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఒక్క ప్రమాదంలోనే ఇంతమంది మరణించడం విషాదమైతే.. వీరిలో చాలామంది ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడం మరో విషాదం. ఇలా గుర్తు పట్టలేని వారిని గుర్తుపట్టాలని మృతదేహాల ఫొటోలను తీసి వెబ్‌సైట్‌లో ఉంచారు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న కొందరు స్వార్థపరులు కొత్త నాటకానికి తెర లేపుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కొట్టేసేందుకు చనిపోయింది తమ వాళ్లేనంటూ నకిలీ డాక్యుమెంట్లతో శవాలను తీసుకెళ్లిపోతున్నారు. తాజాగా ఈ మోసాన్ని గుర్తించిన ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒడిశా కటక్ సమీపంలోని మనియబంధ గ్రామానికి చెందిన గీతాంజలి గుప్తా (35) తన భర్త బిజయ్ దత్తా (40) కనిపించడం లేదని బహనగకు వచ్చింది. ప్రమాదం జరిగిన రోజు తన భర్త కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాడని, అప్పట్నుంచి తన ఆచూకీ తెలియట్లేదని పోలీసులకు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రమాద బాధితులను తరలించిన ఆస్పత్రులకు కూడా వెళ్లానని అయినా లాభం లేకుండా పోయిందని ఏడ్చేసింది. దీంతో పోలీసులు ఆమెను ఒడిశా ప్రమాద మృతదేహాలు ఉంచిన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడున్న ఫొటోలను చూసుకోవాలని సూచించారు. కొన్ని ఫొటోలు చూసిన తర్వాత ఓ వ్యక్తి ఫొటో చూపిస్తూ అతనే తన భర్త అని చెప్పింది.
Read also: MLC Kavitha: కల్వకుంట్ల కాదు.. కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవండి
డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు గీతాంజలి ఆధార్ కార్డ్‌ను అందజేసింది. అయితే అందులో గీతాంజలి వయస్సు 60 ఏండ్లుగా ఉంది. కానీ ఆమె అంత వయస్సు ఉన్నట్లుగా కనిపించలేదు. పైగా ఆమె ప్రవర్తన కూడా పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో ఆధార్ కార్డ్ ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో విచారించారు. అప్పుడు గీతాంజలి భర్త బిజయ్ బతికే ఉన్నాడని తెలిసింది. అంతేకాదు అతను కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించలేదని వెల్లడైంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. మృతుల కుటుంబాలకు ఇచ్చే రూ.10 లక్షల పరిహారం కోసమే ఇలా నకిలీ పత్రాలతో వచ్చానని ఒప్పుకుంది. ఈ విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!