బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కి ప్రాణహాని ఉందన్న ఆరోపణలతో ఆయన భద్రతపై మేడ్చల్ డీసీపీ సందీప్ రావు ఆరా తీశారు. డీజీపీ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు శామీర్‌పేటలోని ఈటల రాజేందర్ నివాసానికి వచ్చిన డీసీపీ సందీప్.. భద్రత విషయమై ఆయనతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని డీసీపీకి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో ఈటల భద్రతపై డీజీపీ అంజనీ కుమార్‌కి డీసీపీ సందీప్ రావు నివేదికను ఇవ్వనున్నారు.
Read Also: SPY Movie Review: నిఖిల్ సిద్దార్థ్ ‘స్పై’ మూవీ రివ్యూ
కాగా, 2 రోజుల క్రితం ఈటల రాజేందర్ భార్య జమున తన భర్తకు ప్రాణహాని ఉందని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపాయి. ఈటల దంపతుల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ డీజీపీతో మాట్లాడి, సీనియర్ IPSతో విచారణ చేయించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫునే సెక్యూరిటీ ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఈటలతో మాట్లాడి భద్రత పరమైన అంశాలను పరిశీలించాలని మేడ్చల్ డీసీపీని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు.
Read Also: iPhone 14 Pro Max Price Drop: బంపర్ ఆఫర్.. రూ. 40 వేలకే ఐఫోన్ 14 ప్రో మాక్స్!
డీజీపీ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు నిన్న ఉదయం ఈటల ఇంటికి వచ్చిన డీసీపీ.. ఆయన ఇంటి పరిసరాలను పరిశీలించారు. అయితే ఈటల రాజేందర్ నిన్న (బుధవారం) అందుబాటులో లేకపోవడంతో ఇవాళ (గురువారం) మళ్లీ ఆయన ఇంటికి డీసీపీ సందీప్ రావు వెళ్లి కలిసి అన్ని విషయాలను తెలుసుకున్నారు. ఈటల ఇచ్చిన విషయాలను ఆధారంగా చేసుకుని డీజీపీకి డీసీపీ రిపోర్ట్ ఇవ్వనున్నారు.