Minister KTR: ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రత గురించి మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ కు ఫోన్ చేసి ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఈటల భద్రత విషయంలో సీనియర్ ఐపీఎస్ తో సమీక్షించాలని సూచించారు. తన భర్తకు ప్రాణహాని ఉందని ఆయన్ని చంపాలని చూస్తున్నారు అంటూ ఈటల రాజేందర్ భార్య జమున మీడియా ముందు సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఆరోపించిన గంటల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది.
Read Also: Urfi Javed: ఏంటి ఉర్ఫీ.. ఓ వైపు విప్పుకున్నావు.. మరోవైపు కప్పుకున్నావ్.. ఇదేం డ్రెస్
Also Read
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ఈటల భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈటల రాజేందర్ కు వై-కేటగిరి భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తలతో రాష్ట్ర సర్కార్ తరపున భద్రత ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ భావించారు. దీంట్లో భాగంగానే కేటీఆర్ డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేసి సీనియర్ ఐపీఎస్ తో సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో డీజీపీ ఈటలకు భద్రత పెంపు విషయంలో సమీక్ష చేశారు. దీని కోసం సీనియర్ ఐపీఎస్ అధికారి ఈటల నివాసానికి వెళ్లారు.
Read Also: Amit Malviya: రాహుల్ గాంధీపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ట్వీట్లు.. కేసు నమోదు
కాగా తన భర్త ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన భార్య ఈటల జమున ఆరోపణలు చేసింది. రూ.20 కోట్లు ఇచ్చైనా ఈటల రాజేందర్ ను హత్య చేయిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నట్లు ఈటల జమున ఆరోపించడం రాజకీయవర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ క్రమంలో ఈటలకు భద్రత పెంపునకు ప్రాధాన్యత ఏర్పడింది.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!