యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, పాకిస్థాన్ పాలకులు కలవర పాటుకు గురవుతున్నారు. యుద్ధం వచ్చేసిందని, ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గంటలు ఘడియలతో సహా యుద్ధం ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పేస్తున్నారు. ముహూర్తాలు పెట్టేస్తున్నారు. అణు హెచ్చరికలు చేస్తున్నారు. అణ్వాయుధాలు తమ వద్ద మాత్రమే ఉన్నట్లు ప్రగల్బాలు పోతున్నారు. నిజానికి, భారత దేశం వద్ద పాక్ కంటే శక్తివంతమైన యుధాలు ఉన్నాయి. ఒక్క అణ్వాయుధాలే…
Fire Accident : సికింద్రాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్యాట్నీ సెంటర్‌లోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ బిల్డింగ్ ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ మంటలు బిల్డింగ్ అంతటా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు , స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు సంఘటన…
సాధారణంగా రోడ్లు వేసేటప్పుడు, పెద్ద పెద్ద భవంతులు నిర్మించే సమయంలో చెట్లు అడ్డుగా ఉంటే ఏం చేస్తారు? దాన్ని నరికి పక్కన పారేస్తారు. ఇదే సులభమైన పని కదా.. కానీ.. సికింద్రాబాద్ మారేడ్పల్లిలో మాత్రం ట్రాఫిక్ పోలీసులు చెట్టుకు ప్రాణప్రతిష్ట చేశారు. రోడ్డుపై ఉన్న భారీ వృక్షాన్ని వేళ్ళతో సహా పెకిలించి, మరోచోట నాటారు. భారీ క్రేన్ల సహాయంతో చెట్టును తరలించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ వినూత్న ప్రయత్నం సఫలీకృతం కావడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో…
లాయర్లు గుండెపోటు ఘటనలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కోర్టు ఆవరణల్లో కుప్పకూలుతున్నారు. ఓ కేసుకు సంబంధించి తన క్లైయింట్ తరుఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ వేణుగోపాల్ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న తోటి లాయర్లు, కోర్టు సిబ్బంది హాస్పిటల్‌కు తరలించే లోపే మార్గమధ్యలో మృతి చెందారు. ఇటీవల తెలంగాణ హైకోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది..
Sand Mafia: హైదరాబాద్‌లో ఇసుక అక్రమ రవాణా, ఇసుక నిల్వలు, విక్రయం జోరుగా సాగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. వివిధ జిల్లాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్న మాఫియా అరాచకాలు మితిమీరుతున్నాయి. ఈ అక్రమ దందాపై టాస్క్ ఫోర్స్ విభాగం దృష్టి సారించి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తోంది. జిల్లాలలోని ఇసుక రీచ్‌ల నుంచి లారీల ద్వారా ఇసుకను సరఫరా చేయించుకునే మాఫియా 10,000 రూపాయలకు ఒక లారీ…
సికింద్రాబాద్లో గంజాయి కలకలం రేపుతోంది. 15 కేజీల గంజాయిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ సీజ్ చేశారు. ఒరిస్సా నుండి సికింద్రాబాద్ మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు.
సికింద్రాబాద్లో భారీగా గంజాయి పట్టివేత కలకలం రేపుతోంది. జింఖానా గ్రౌండ్స్ వద్ద 10 కేజీల గంజాయిని ఎక్సైజ్ STF అధికారులు సీజ్ చేశారు. పది కిలోల గంజాయిని పట్టుకున్నారు. అరకు నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు.
Ayyappa Devotees: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికిద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, మౌలాలి నుంచి కొట్టాయం,
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నర్సింగ్ విద్యార్థులు గాంధీ ఆసుపత్రి ముట్టడించేందుకు యత్నించారు. బోయగూడలోని నర్సింగ్ కళాశాల, హాస్టల్లో డ్రైనేజీ సమస్య మూలంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలలో మురుగు వ్యవస్థ అద్వాన్నంగా తయారై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.
చిట్టీల పేరుతో 20కోట్ల రూపాయల మోసానికి పాల్పడి అదృశ్యమైన దంపతులు తమకు తామే పోలీసుల ముందు ప్రత్యక్షమైన ఘటన వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో నిందితులు బాపూజీ నగర్ కు చెందిన అమరేందర్ యాదవ్ (53), సబిత (49) దంపతులు అందరికీ నమ్మకంగా గత 20ఏళ్లుగా ప్రైవేట్ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఐతే ఇటీవలి కాలంలో చిట్టీ పాట పాడికున్న వారికి చిట్టి డబ్బులు ఇవ్వకుండా సతాయించడమే కాకుండా…