Hyderabad: సికింద్రాబాద్ లోని మిలిటరీ ఏరియాలో చొరబాటుపై విచారణ వేగవంతం చేశారు. మిలిటరీ ఏరియాలో అనుమానితుల కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాంటి సోషల్ ఎలిమెంట్స్ తో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. తిరుమలగిరి మిలిటరీ ఏరియాలో నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. ఈ నలుగురిలో ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర ఫేక్ మిలిటరీ అధికారుల పేరుతో ఉన్న నకిలీ ఐడీ కార్డులు లభ్యం అయ్యాయి. ఈ అనుమానితులపై సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఉన్నతాధికారులు.
Read Also: Draupadi Murmu: కౌన్సిలర్ టూ రాష్ట్రపతి.. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన గిరిజన మహిళ చరిత్ర..!
అయితే, అనుమానాస్పదంగా తిరుగుతూ మిలిటరీ ఏరియాలో ఫోటోలు, వీడియోలపై విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇక, గతంలో ఉగ్రవాదులు సైతం ఈ తరహా ఫోటోలు తీశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అందుకే, ఈ ఘటనపై ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వారు అమాయకులేనా, ఉద్యోగం కోసమే వచ్చారా.. లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనేది వెరీఫై చేస్తున్నాం అని వెల్లడించారు.