తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నర్సింగ్ విద్యార్థులు గాంధీ ఆసుపత్రి ముట్టడించేందుకు యత్నించారు. బోయగూడలోని నర్సింగ్ కళాశాల, హాస్టల్లో డ్రైనేజీ సమస్య మూలంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలలో మురుగు వ్యవస్థ అద్వాన్నంగా తయారై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. గత నెల రోజులుగా హాస్టల్లో డ్రైనేజీ మురుగు సమస్య అధికమవడంతో విద్యార్థులు ఇతర ప్రాంతాలకు, స్వస్థలాలకు వెళ్తున్నట్టు తెలిపారు. గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్కు, అధికారులకు పలుమార్లు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్‌కు వినతి పత్రం అందజేశారు.
Read Also: Janhvi Kapoor: మధురానగర్ హనుమాన్ గుడిలో జాన్వీకపూర్ పూజలు
ఈ నెల 28న పరీక్షలు దగ్గరికి రావడంతో సెలవులు కావాలని.. ఆ కంపు వాసనలో ఉండలేమని.. మా ఊర్లోకి వెళ్ళిపోయి చూసుకుంటామని చెప్పినా, గాంధీ ఆసుపత్రి నర్సింగ్ విభాగం సూపరిండెంట్ హౌస్ ప్రిన్సిపాల్ ఒప్పుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. ఈ క్రమంలో సూపరిండెంట్ మాట్లాడుతూ.. ఈ నెల 23, 28న పరీక్షలు ఉండడం కారణంగా వారం రోజుల ముందు సెలవు ఇస్తామని అంతకుమించి సెలవులు ఇవ్వలేమని చెప్పామన్నారు. గాంధీ ఆసుపత్రిలో 800 నర్సింగ్ విద్యార్థుల కోసం హాస్టల్ ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ.. గాంధీలో ఉండలేమని, హాస్టల్లో కావాలని అక్కడ సమస్యలు పరిష్కరించాలని దాదాపు మూడు గంటల పాటు ఆసుపత్రి చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు.
Read Also: Airport Jobs 2024: 10వ తరగతి ఉత్తీర్ణతతో ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా?