Scrub Typhus: తిరుపతి చంద్రగిరి(మం) తొండవాడలో ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్ సోకింది. బాలిక కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. చంద్రగిరి సీహెచ్‌సీ, అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. రక్తపరీక్షల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారులు వెల్లడించారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు, వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.
Scrub Typhus: ఏపీలో రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో వ్యాపిస్తున్న భయాందోళనలను తొలగించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టత ఇచ్చింది. స్క్రబ్ టైఫస్ కొత్త వ్యాధి కాదని, ప్రతి సంవత్సరం మలేరియా, డెంగీ లాగే సుమారు 1300 నుంచి 1600 కేసులు నమోదవుతూ ఉంటాయని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1566 కేసులు నమోదయ్యాయని, గత సంవత్సరం 1613 కేసులు ఉన్నాయని తెలిపారు. స్క్రబ్ టైఫస్ వల్ల…
Scrub Typhus Ravaging AP: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల స్క్రబ్ టైఫస్ వ్యాధి తీవ్రత పెరిగింది. పురుగు కుట్టడం ద్వారా సంక్రమించే ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో భయాందోళన వాతావరణం నెలకొంది. తాజాగా మరో వ్యక్తి మృతి చెందడంతో, స్క్రబ్ టైఫస్ కారణంగా సంభవించిన మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ తాజా మృతి కృష్ణా జిల్లాలో నమోదైంది. ఉయ్యూరు మండలం, మొదునూరు గ్రామానికి చెందిన 44 ఏళ్ల వ్యక్తి శివశంకర్, స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మరణించారు. ఈ…
ఇటీవల స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. చిన్న నల్లి ద్వారా వ్యాపించే ఈ ఇన్‌ఫెక్షన్‌ను సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి, దాని లక్షణాలు, ప్రమాదాలు, జాగ్రత్తలు అన్న విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అత్యవసరం. స్క్రబ్ టైఫస్ అనేది ‘ఒరియెంటియా సూసుగముషి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధి. ఇది ముఖ్యంగా పచ్చిక బయళ్లలో, పొదల్లో…
Scrub Typhus: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఆ రాష్ట్రంలో తొలి మరణం సంభవించినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు.
ఒడిశాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ వైరస్ మహారాష్ట్రకూ పాకింది. ఔరంగాబాద్, జల్నా, బుల్దానా జిల్లాల్లో ఈ వైరస్ బాధితులను గుర్తించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి మొత్తం 16 కేసులను గుర్తించారు. దీంతో మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ సోకిన ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఇక ఒడిశాలో ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే 210 కి పైగా కేసులు నమోదయ్యాయి.…
Scrub Typhus: ఒడిశా రాష్ట్రాన్ని ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి కలవరపెడుతోంది. తాజాగా సుందర్‌ఘర్ జిల్లాలో మరో 11 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 180కి చేరింది. తాజాగా 59 శాంపిళ్లను పంపించగా 11 మందికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ గా తేలింది. ఎక్కువగా కేసులన్నీ సుందర్‌ఘర్ జిల్లాలో నమోదయ్యాయని జిల్లా వైద్యాధికారి కన్హుచరణ్ నాయక్ తెలిపారు.
పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే మరో కొత్త వ్యాధి బెంగాల్ ను ఆందోళన పరుస్తోంది. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కోల్‌కతా నగరంలో స్క్రబ్ టైఫస్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్లు కలుగుతుంది. ఇప్పటి వరకు బెంగాల్ వ్యాప్తంగా 10 మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్దారు. వీరందరికి చికిత్స అందిస్తున్నారు. దీంతో బెంగాల్ లో…
కరోనా, మంకీపాక్స్ ఇలా ప్రపంచాన్ని ఏదో ఓ వ్యాధి కలవరపెడుతూనే ఉంది. కరోనా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం కలిగిస్తుంటే.. ప్రస్తుతం మంకీపాక్స్ వైరస్ తో మరో ముప్పు ప్రపంచం ముందర ఉంది. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్లో మాత్రం స్క్రబ్ టైఫస్ అనే కొత్త రకం జ్వరాలు వణికిస్తున్నాయి. ఈ స్క్రబ్ టైఫస్ జ్వరాలతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది బెంగాల్ మే నాటికి దాదాపుగా 60కి పూగా స్క్రబ్…