Scrub Typhus: మహారాష్ట్ర వైద్యశాఖ అప్రమత్తం… రాష్ట్రంలో ప్రవేశించిన స్క్రబ్ టైఫస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ వైరస్ మహారాష్ట్రకూ పాకింది. ఔరంగాబాద్, జల్నా, బుల్దానా జిల్లాల్లో ఈ వైరస్ బాధితులను గుర్తించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి మొత్తం 16 కేసులను గుర్తించారు. దీంతో మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ సోకిన ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఇక ఒడిశాలో ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే 210 కి పైగా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 5 మందికి ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేకపోవడం కలవరపాటుకు గురిచేస్తోంది. దీనిని అరికట్టడం రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు, జిల్లా యంత్రాంగానికి పెను సవాల్‌గా మారింది.
Also Read: Mutual Funds: త్వరగా కోటీశ్వరులు కావాలనుకుంటే.. ఈ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి
Also Read
కేవలం ఒడిశాలోనే కాకుండా ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలోకూడా మరో ఐదుగురు చనిపోయారు. ఈ విషయాన్ని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ వైరస్ ఎలా వస్తుంది, లక్షణాలు ఏంటి అనే విషయాన్ని ఓసారి పరిశీలిస్తే స్క్రబ్ టైఫస్.. ఓరియెంటియా త్సుత్సుగముషి అనే బ్యాక్టీరియా కారణంగా సోకుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెల్లడించింది. ఈ బ్యాక్టిరియా సోకిన పురుగు కుట్టడం వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని పేర్కొంది. దీనిలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే పురుగు కుట్టిన పది రోజుల తర్వాత వైరస్ లక్షణాలు కనిపిస్తాయి. దీని కారణంగా అప్పటికే వైరస్ మొత్తం వ్యాపిస్తుంది. ఇది హెపటిటిస్ కు, గ్యాస్ట్రోఇంటెస్టినల్ హెమరేజ్, హైపోవోలెమియాకు దారితీయొచ్చు. ఇక వీటి లక్షణాల విషయానికి వస్తే ప్రధానంగా జ్వరం, తలనొప్పి, తీవ్రమైన ఒళ్లు నొప్పులతో పాటు కొంతమందిలో దద్దుర్లు కనిపిస్తాయి. లక్షణాలు బయటపడిన వెంటనే చికిత్స ప్రారంభించాలి. వీలైనంత త్వరగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా బాధితులు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కామన్ గా కొండ ప్రాంతల్లో, పొదల్లో ఉండే పేలు లాంటి పురుగులు ద్వారా వస్తాయి.
- Tags
- maharastra
- Odisha
- scrub typhus
తాజావార్తలు
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
-
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
-
Konda Surkha : సీఎం రేవంత్‌కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!