Scrub Typhus: ఒడిశా రాష్ట్రాన్ని ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి కలవరపెడుతోంది. తాజాగా సుందర్‌ఘర్ జిల్లాలో మరో 11 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 180కి చేరింది. తాజాగా 59 శాంపిళ్లను పంపించగా 11 మందికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ గా తేలింది. ఎక్కువగా కేసులన్నీ సుందర్‌ఘర్ జిల్లాలో నమోదయ్యాయని జిల్లా వైద్యాధికారి కన్హుచరణ్ నాయక్ తెలిపారు.
జిల్లాలో శనివారం ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ సోకిన కీటకాలు కుట్టడం వల్ల వ్యాపిస్తుంది. కాటు వల్ల బ్యాక్టీరియా శరీరంలోకి చేరి అనారోగ్యానికి కారణమవుతుంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. బార్‌గర్ జిల్లాలో 6 మంది చనిపోగా.. ఒకరు సుందర్‌ఘర్ జిల్లాలో చనిపోయారు. ఇదిలా ఉంటే పరిస్థితిని సమీక్షించడానికి ఆరోగ్యశాక శనివారం బుర్లాలోని వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ నుంచి ముగ్గురు సభ్యుల బృందాన్ని బర్‌ఘర్ జిల్లాకు పంపింది. ప్రస్తుతం ఈ జిల్లాలో 11 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read Also: Dabur: రోజుకు 2.4 కోట్ల హజ్మోలా తింటున్న ఇండియన్స్.. రూ.కోట్లు సంపాదిస్తున్న డాబర్
వ్యవసాయ భూములు, అడువులను తరుచుగా సందర్శించే వ్యక్తులు ఈ వ్యాధికి గురవుతున్నారు. స్క్రబ్ టైఫస్ అనే జ్వరాన్ని పట్టించుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. ఈ వ్యాధి ముదిరితే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి దారి తీయవచ్చు. దీంతో రోగి మరణిస్తారు. సాధారణంగా పొదలు, అడవులకు, జంతువులకు దగ్గరగా నివసించే వారు పేలు వంటి కీలకాల కాటు వల్ల ఈ వ్యాధికి గురవుతారు. దీని బారిన పడుతున్న వారిలో పిల్లలు, వృద్దులే ఎక్కువగా ఉంటున్నారు. క్రిమి కాటు వల్ల ఏర్పడే మచ్చ ఈ వ్యాధికి ఒక సంకేతం అని నిపుణులు చెబుతున్నారు.
ఈ వ్యాధికి గురైతే డెంగ్యూ మాదిరిగానే శరీరంపై దద్దర్లు వస్తాయి. జీర్ణ సమస్యలు, జ్వరం, కొందరిలో శ్వాస సమస్యలు వస్తాయి. వెంటిలేటర్, ఐసీయూ సౌకర్యాలు రోగికి చాలా అవసరం. సకాలంలో ట్రీట్మెంట్ అందకపోతే రోగి మరణించవచ్చు.