హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. అర్దరాత్రి రెండు ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం చేశారు. పోలీసులు అప్రమత్తం కావడంతో దొంగలు పారిపోయారు. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి ఎస్ బి ఐ బ్యాంక్ ఏ టీ ఎంతో పాటు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో చోరికి ప్రయత్నించారు దొంగలు. దోబీఘాట్ లోని జయ్ హింద్ హోటల్ సమీపంలో ఉన్న రెండు ఏటీఎంలలోకి ప్రవేశించారు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు. అర్దరాత్రి ఏటీఎం సెంటర్ లోకి ప్రవేశించి చోరీకి ప్రయత్నించారు.…
బ్యాంకులు రుణాలు ఎగ్గొట్టిన కేసులో హైదరాబాద్‌కు చెందిన మీనా జువెల్లర్స్‌పై సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. కంపెనీతో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ అయిన ఉమేష్ జేత్వానిపై కూడా కేసు నమోదు చేశారు. ఎస్‌బీఐ ఆధ్వర్యలోని కన్సార్టియం నుంచి రూ. 364.2 కోట్ల రుణం తీసుకుని మోసం చేశారని సీబీఐ అభియోగాలు మోపింది. 2015 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కంపెనీ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుంది. మీనా జువెల్లర్స్ డైమండ్ ప్రైవేట్…
సింగరేణి కంపెనీలో పనిచేసే ఆఫీసర్లు, కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పింది యాజమాన్యం.. రూ.40 లక్షల ప్రమాద బీమా వర్తింపజేసేందుకు నిర్ణయం తీసుకుంది.. దీని కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో ఒప్పందం చేసుకుంది… ఎస్బీఐలో ఖాతా ఉన్న సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు ఇకపై రూ.40 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది… ఈ మేరకు సింగరేణి – ఎస్బీఐ మధ్య చారిత్రక ఒప్పందం జరిగింది… ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ మొత్తం రూ.20…
గతవారం దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడ్ రెట్లు వంటి అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. దేశీయంగా టాప్ లిస్టులో ఉన్న కంపెనీలలో రిలయన్స్ మినహా మిగతా అన్ని కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. గతవారం టాప్ 9 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,03,532.08 కోట్ల మేర క్షీణించింది. టీసీఎస్ భారీగా నష్టపోగా, టాప్‌లో ఉన్న రిలయన్స్ మాత్రం భారీగా లాభపడింది. Read: Job: వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తూ…
నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ స్టేట్మెంట్లతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు భారీ మొత్తంలో కుచ్చుటోపీ పెట్టారు. నందిని ఇండ్రస్టీస్ ఇండియా లిమిటెడ్ పేరుతో సెక్యూరిటీగా రూ.77 కోట్ల విలువైన ఆస్తులు పెట్టి రూ. 303 కోట్లు రుణం తీసుకున్నారు. అయితే రుణానికి సంబంధించిన డబ్బులు తిరిగి చెల్లించకుండా కంపెనీ చేతులెత్తేసింది. దీంతో బ్యాంకు అధికారులు సీబీఐ ను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు నందిని ఇండస్ట్రీస్ పై సీబీఐ కేసు నమోదు. అంతేకాకుండా…
ప్రభుత్వ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) వడ్డీ రేట్లను పెంచింది ఎస్బీఐ.. రికరింగ్ డిపాజిట్ పెట్టుబడులపై 5.1 శాతం నుండి 5.4 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇక, సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అరశాతం ఎక్కువ ఉంటుందని పేర్కొంది.. సవరించిన వడ్డీ రేట్లు జనవరి 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టు ఎస్బీఐ తెలిపింది.. కేవలం 100 రూపాయల…
కొత్త ఏడాదిలో అడుపెట్టాం.. జనవరి నెల కూడా పూర్తి కావొచ్చింది.. ఎల్లుండి నుంచి ఫిబ్రవరి మాసం ప్రారంభం కానుంది.. ఇప్పటికే కొత్త ఏడాదిలో కొత్త ఛార్జీలను అమలు చేస్తున్న దేశంలోనే అతిపెద్ద బ్యాకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ.. ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్) ఛార్జీలను పెంచబోతోంది.. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో ఐఎంపీఎస్ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ వడ్డించనుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అయితే, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రొత్సహించేందుకే ఎస్బీఐ…
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగం బ్యాకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది.. గర్భిణీ ఉద్యోగుల విషయంలో ఎస్బీఐ కొత్తగా జీరా చేసిన సర్క్యులర్‌పై వివాదం మొదలైంది.. దీనిపై స్పందించిన ఉమెన్ కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది.. ఇక, వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ కూడా రాశారు.. అయితే, అన్ని రకాల నుంచి వివాదులు చుట్టుముట్టడంతో.. ఎస్బీఐ దిగొచ్చింది.…
మూడు నెలలు నిండిన గర్భిణులను సర్వీసులో చేర్చుకోకుండా అడ్డుకుంటున్న ఎస్ బీఐకి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మూడు నెలలు నిండిన గర్భిణులు సర్వీసులో చేరకుండా నిరోధిస్తూ ఎస్బీఐ 2021 డిసెంబర్ 31న జారీ చేసిన మార్గదర్శకాలు, ‘వారిని తాత్కాలిక అన్ ఫిట్’ అని పేర్కొనడం వివక్ష చూపించడమే. అంతేకాదు చట్ట విరుద్ధం కూడా. చట్ట ప్రకారం…
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న సమయంలో.. పలు రకాల రీసెర్చ్‌లు కోవిడ్ తీవ్రతను అంచనా వేస్తూ.. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.. దేశంలో క్రమంగా కోవిడ్ మీటర్ మరోసారి పైకి పరుగులు పెడుతోన్న సమయంలో.. ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎబ్బీఐ) తాజాగా నిర్వహించిన అధ్యయనం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.. భారత్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ వ్యాప్తి మూడు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని అంచనా వేసింది ఎస్బీఐ రీసెర్చ్.. ఇప్పటికే…