దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగం బ్యాకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది.. గర్భిణీ ఉద్యోగుల విషయంలో ఎస్బీఐ కొత్తగా జీరా చేసిన సర్క్యులర్‌పై వివాదం మొదలైంది.. దీనిపై స్పందించిన ఉమెన్ కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది.. ఇక, వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ కూడా రాశారు.. అయితే, అన్ని రకాల నుంచి వివాదులు చుట్టుముట్టడంతో.. ఎస్బీఐ దిగొచ్చింది. గర్భిణీ ఉద్యోగుల విషయంలో కొత్తగా జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది ఎస్బీఐ.
Read Also: తెలంగాణలో స్కూళ్ల రీఓపెన్.. విద్యాశాఖ మంత్రి ప్రకటన
కాగా, గర్భిణి అభ్యర్థుల విషయంలో 3 నెలలు దాటినవారే విధుల్లో చేరడానికి తాతాల్కికంగా అనర్హులంటూ స్టేట్ బ్యాంక్ ఇండియా సర్క్యులర్ జారీ చేయడమే వివాదానికి కారణంగా మారింది.. ఆపై విమర్శలు మొదలయ్యాయి.. పైగా బిడ్డకు జన్మనిచ్చిన 4 నెలలలోపు చేరొచ్చంటూ పోయినేడాది డిసెంబర్ 31న రిలీజ్ చేసిన ఆ సర్క్యులర్‌లో పేర్కొంది ఎస్బీఐ… ఇది వివక్షతో కూడుకున్న నిర్ణయమని.. రాజ్యంగబద్ధమైన ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమే అవుతుందని.. కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020 ప్రకారం అది చెల్లదంటూ.. ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది.. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన ఎస్బీఐ.. మునుపటి నిబంధనల ప్రకారం, గర్భిణీ స్త్రీల అభ్యర్థులు గర్భం దాల్చిన ఆరు నెలల వరకు బ్యాంకులో నియమించబడటానికి అర్హులను స్పష్టం చేసింది..