దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)… తన ఖాతాదారులకు కీలక సమాచారాన్ని చేరవేసింది… డిజిటల్ లావాదేవీలకే ఎక్కువగా మొగ్గుచూపుతోన్న తరుణంలో.. తాత్కాలికంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్ సేవలు నిలిచిపోయాయని సూచించింది.. వార్షిక ఆర్థిక కార్యకలాపాల ముగింపు సందర్భంగా.. ఈ రోజు (ఏప్రిల్ 1 శుక్రవారం) మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో ఆధారిత సేవలు అందుబాటులో ఉండవని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది..
Read Also: Raghunandan: మా పేర్లు శిలా ఫలకాలపై అవసరం లేదు.. ప్రజల మనుసుల్లో ఉన్నాం..
ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసిపోగా.. ఇవాళ్టి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది.. వార్షిక ముగింపు కార్యకలాపాల కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్‌లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, UPI సేవలను ఈరోజు మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు పొందలేరు అని పేర్కొంది… ఈ పరిస్థితిపై తన వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.. అయితే, ఇదే సమయంలో ఎస్బీఐ కస్టమర్లు.. తమ ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి లేదా మినీ స్టేట్‌మెంట్ పొందడానికి బ్యాంకింగ్ ఎస్‌ఎంఎస్ సేవలు ఉపయోగించుకోవచ్చు.. మీ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవడానికి 09223766666కి “BAL” అని టెక్స్ట్ చేస్తే.. వెంటనే మీ బ్యాలెన్స్ వివరాలు ఎస్‌ఎంఎస్ రూపంలో పొందే వీలు ఉంటుందని తెలిపింది. కాగా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) జారీ చేసిన డేటా ప్రకారం, డిసెంబర్ 2021లో ఎస్బీఐ అతిపెద్ద UPI చెల్లింపుదారుగా ఉంది. ఇక, ఎస్బీఐ వెబ్‌సైట్ ప్రకారం, ఇది దేశంలో నాలుగో వంతు మార్కెట్ వాటాలో అతిపెద్ద బ్యాంక్. తన 11 అనుబంధ సంస్థల ద్వారా వ్యాపారాలను విజయవంతంగా నడిపిస్తోంది ఎస్బీఐ.