Banks exposure to Adani Group: అదానీ గ్రూప్ కంపెనీల బిజినెస్‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ అనంతరం ఇన్వెస్టర్లు, డిపాజిటర్లు లబోదిబో అంటున్నారు. తమ డబ్బు ఏమైపోతుందో ఏమోనని దిగులు పెట్టుకున్నారు. దీంతో పార్లమెంట్ సైతం ఇదే వ్యవహారంపై దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో.. అదానీ గ్రూపు సంస్థలకు రుణాలిచ్చిన బ్యాంకులు మరియు ఎల్‌ఐసీ ఒకదాని తర్వాత ఒకటి స్పందిస్తున్నాయి. తాము ఎంత లోనిచ్చామో చెబుతున్నాయి.
Home Loan Comparison : సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. కాగా, పట్టణాల్లో సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అని అనుకునే వారిలో దాదాపు 90శాతం బ్యాంకులనుంచి రుణాలు తీసుకుంటారు.
SBI Loan:దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ (ఎస్‌బీఐ) పండుగపూట కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. బ్యాంక్ తన రుణ రేట్లను అంటే MCLRని మళ్లీ పెంచుతున్నట్లు ప్రకటించింది.ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలకు ఈ రేటును పెంచారు.
Today (03-01-23) Business Headlines: పబ్లిక్ ఇష్యూకి హైదరాబాద్ సంస్థ: బ్యాంకులతో కలిసి ప్రీపెయిడ్ కార్డులను జారీచేసే హైదరాబాద్ సంస్థ జాగల్ ప్రీపెయిడ్ ఓవర్సీస్ సర్వీసెస్.. పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఫేస్ వ్యాల్యూ రూపాయితో కొత్త షేర్లను కేటాయించటం ద్వారా 490 కోట్ల ఫండ్‌రైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి తెలిపింది.
Today (02-01-23) Business Headlines: హైదరాబాద్ బిర్యానీకి అత్యధిక ఆర్డర్లు: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పండగ చేసుకుంది. దేశవ్యాప్తంగా మూడున్నర లక్షల బిర్యానీలను మరియు రెండున్నర లక్షలకు పైగా పిజ్జా ఆర్డర్లను డెలివరీ చేసింది. 75 శాతం మందికి పైగా కస్టమర్లు హైదరాబాద్ బిర్యానీనే కోరుకున్నారని ట్విట్టర్‌లో నిర్వహించిన సర్వేలో తేలినట్లు స్విగ్గీ వెల్లడించింది.
RBI to launch Digital Rupee pilot in 4 cities today: క్యాష్ లెస్ ఎకానమీ కోసం దేశం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. దీన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఆర్బీఐ నేడు డిజిటల్ రూపాయిని ప్రారంభించనుంది. 2016 నుంచి భారతదేశం అంతటా డిజిటల్ లావాదేవీలను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే నేటి నుంచి ప్రయోగాత్మకంగా ఇండియాలో నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయిని ప్రారంభించనుంది.
India's GDP grows at 6.3% in Jul-Sept quarter of FY23: భారతదేశ జీడీపీ వృద్ధిరేటు 2023 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతంగా నమోదు అయింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)లో భారత ఆర్థిక వ్యవస్థ 6.3 శాతం వృద్ధి చెందిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది. బుధవారం అధికారిక డేటాను విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఇది గతేడాదితో పోలిస్తే తక్కువే. 2021-22 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో…
RBI Set To Launch Retail Digital Rupee: రిలైట్ డిజిటల్ రూపీ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆర్‌బీఐ సిద్ధమైంది. పర్సన్ టూ పర్సన్, పర్సన్ టూ మర్చంట్ ఇలా డిజిటల్ రూపాయిలో లావాదేవీలు ప్రారంభించనుంది ఆర్‌బీఐ. కస్టమర్స్ డిజిటల్ వాలెట్ల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీ కార్యక్రమంలో పాల్గొనే బ్యాంకులకు చెందిన డిజిటల్ వాటెట్ల ద్వారా మాత్రమే డిజిటల్ రూపాయితో లావాదేవీలు జరగనున్నాయి. గురువారం నుంచి కొన్ని నగరాల్లో ఈ…
SBI hikes MCLR: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. తన ఖాతాదారులకు మరోసారి షాకిచ్చింది.. అన్ని కాలపరిమితులకు గాను మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఇక, ఇవి ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది.. ఎస్బీఐ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో బ్యాంకులో తీసుకున్న రుణాలు మరింత భారంగా మారాయి.. వెహికల్స్ లోన్స్, పర్సనల్…