నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ స్టేట్మెంట్లతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు భారీ మొత్తంలో కుచ్చుటోపీ పెట్టారు. నందిని ఇండ్రస్టీస్ ఇండియా లిమిటెడ్ పేరుతో సెక్యూరిటీగా రూ.77 కోట్ల విలువైన ఆస్తులు పెట్టి రూ. 303 కోట్లు రుణం తీసుకున్నారు. అయితే రుణానికి సంబంధించిన డబ్బులు తిరిగి చెల్లించకుండా కంపెనీ చేతులెత్తేసింది. దీంతో బ్యాంకు అధికారులు సీబీఐ ను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు నందిని ఇండస్ట్రీస్ పై సీబీఐ కేసు నమోదు. అంతేకాకుండా నందిని ఇండ్రస్టీస్ ఇండియా లిమిటెడ్ ఎండీ హరిదాస్ రమేశ్, ప్రమోటర్ డైరెక్టర్ ఊర్వశి లపై కూడా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
అయితే నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ స్టేట్మెంట్లతో భారీ మోసానికి పాల్పడినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఎస్బీఐ బ్యాంకు రుణాలు వ్యక్తిగత అవసరాలతో పాటు ఇతర కంపెనీలకు మళ్లించినట్టు గుర్తించారు. రుణాలు పొందడం వెనుక కొంత మంది బ్యాంకు అధికారుల పాత్ర ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నందిని ఇండ స్ట్రీస్ ఇండియా లిమిటెడ్ ఎండీ, డైరెక్టర్గా ఉన్న హరిదాస్ రమేశ్, ఊర్వశి ఇద్దరు మరో 22 కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నట్టు తెలుస్తుంది.