Toilet Footwear: నెట్టింట వైరల్‌గా మారిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా చెప్పుల ధర ఎంత ఉంటుంది. వందలల్లో ఉంటుంది. ఇక కాస్తా ధనవంతులైతే వేలల్లో పెట్టి కొంటారు. మరి బాత్రూంకు వాడే చెప్పులైతే వంద రూపాయలు లేదా ఇంకాస్తా ఎక్కువ పెట్టి కొంటారు. కానీ సౌదీ అరేబియాలోని ఒక దుకాణంలో వేలల్లో కాదు లక్షల్లో అమ్ముతున్నారు. నిజమేనండోయ్..ప్రస్తుతానికి దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ చెప్పులు మన దేశంలో చాలా మంది టాయిలెట్‌తో ఉపయోగించేటప్పుడు ధరించే స్లిప్పర్‌లతో సమానంగా ఉంటాయి. ఆ చెప్పులు అచ్చంగా మన దగ్గర ఒకప్పుడు ఎక్కువగా ఉండే బ్లూ అండ్ వైట్ పారాగాన్ చెప్పుల మాదిరిగా ఉన్నాయి. వందో రెండొందలో పెడితే వచ్చే ఈ చెప్పుల ధర రూ. లక్ష పలుకుతోంది. సౌదీ అరేబియాలోని ఒక స్టోర్‌లో ఈ స్లిప్పర్స్ ధర 4500 రియాల్స్‌గా (సౌదీ అరేబియా కరెన్సీ) చూపిస్తోంది. అంటే మన కరెన్సీలో ఇది ఏకంగా రూ. లక్ష. ఏదో బంగారంతో చేసినవి కావొచ్చనుకుంటే పొరబడ్డట్లే. సాధారణంగా బాత్రూం కోసం వాడే చెప్పుల్లానే ఉన్నాయి మరీ. నిజంగానే సౌదీ అరేబియాలోని ఒక స్టోర్ లో అద్దాల్లో పెట్టి మరీ లక్ష రూపాయలకు ఈ చెప్పులను ఒక లగ్జరీ ఐటంగా అమ్ముతున్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీ సీఎంవో చీఫ్ సెక్యూరిటీ అధికారిగా డీఎస్పీ యశ్వంత్ నియామకం
సౌదీ కరెన్సీ ఈ చెప్పుల విలువ 4,500 రియాల్స్.. అంటే మన కరెన్సీలో 1,03,126.01 రూపాయలు. ఈ పోస్ట్‌ను చూసిన భారతీయ నెటిజన్లు హాస్యోక్తులతో స్పందిస్తున్నారు. భారత్‌లో టాయిలెట్‌కు వాడే చెప్పులను లక్ష రూపాయలకు విక్రయిస్తున్నారని ఇంటర్నె్‌ట్‌లో కామెంట్ల వర్షం కురిపించారు. కామెంట్స్ సెక్షన్ మొత్తం నవ్వుతున్న ఎమోజీలతో నిండిపోయింది. ఈ టాపిక్‌పై జోకులే జోకులు వేసుకుంటున్నారు. మన భారతీయలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. మన దేశంలో 100 రూపాయలకు కొని సౌదీ అరేబియాకు తీసుకెళ్లి లక్ష రూపాయలకు అమ్ముకోవాలని సలహాలిస్తున్నారు.
We Indians use these sandals as a toilet footwear 😀 pic.twitter.com/7EtWY27tDT
— Rishi Bagree (@rishibagree) July 16, 2024