Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఈ రోజు సౌదీ అరేబియా వేదికగా ఇస్లామిక్ దేశాలు సమావేశమయ్యాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేటివ్(ఓఐసీ) రియాద్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్, పాలస్తీనాపై జరుపుతున్న దాడిపై ఈ దేశాలు చర్చించాయి. గాజా స్ట్రిప్ లో ప్రస్తుత యుద్ధం గురించి మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ ఆర్మీని ‘‘ఉగ్రవాద సంస్థ’’గా ప్రకటించాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ శనివారం ఇతర ఇస్లామిక్ దేవఆలకు పిలుపునిచ్చారు.
IPL: క్రికెట్ ప్రపంచంలోనే కాకుండా స్పోర్ట్స్ లీగుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ధనిక లీగుల్లో ఒకటిగా మారింది. దీనిపై సౌదీ అరేబియా రాజు కన్ను పడింది. ఐపీఎల్‌లో మల్టీ బిలియన్ డాలర్ల వాటాను కొనుగోలు చేసేందుకు సౌదీ అరేబియా ఆసక్తిగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ న్యూస్ శుక్రవారం నివేదించింది.
Hamas Attack On Israel: గాజాను పాలిస్తున్న హమాస్ మిలిటెంట్లు ఎప్పుడూ లేని విధంగా ఇజ్రాయిల్ పై భీకరదాడి చేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 300 మందికిపైగా ఇజ్రాయిలు చనిపోగా.. చాలా మందిని బందీలుగా మిలిటెంట్లు పట్టుకుని, గాజాకు తీసుకెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌తో సహా వివిధ దేశాలు హమాస్ దాడిని ఖండించాయి. అయితే ఇరాన్ మాత్రం హమాస్ దాడికి మద్దతు తెలుపుతూ, ఈ దాడి ఎంతో గర్వంగా ఉందని వ్యాఖ్యానించింది. పలు ఇస్లామిక్ దేశాల్లో ప్రజలు…
Pakistan: విదేశాల్లో ఉంటున్న పాకిస్తానీయుల్లో 90 శాతం బిచ్చగాళ్లే అని ఇటీవల తేలింది. సౌదీ, ఇరాక్, యూఏఈతో పాటు ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలు, యూరప్ దేశాలకు వెళ్తున్న పాకిస్తానీయులు భిక్షాటన చేస్తున్నారు. ఇప్పటికే ఆయా దేశాల రాయబారులు ఈ విషయంలో పాకిస్తాన్‌కి ఫిర్యాదు చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ధరలు పాకిస్తాన్ ప్రజల్ని బిచ్చగాళ్లుగా మారుస్తున్నాయి.
Telangana Man Died in Fire Accident in Saudi Arabia: సౌదీ అరేబియాలో తాజాగా ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గదిలోని ఏసీ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అయితే అగ్నిప్రమాదం రాత్రి పూట జరిగింది. దీంతో ఆ గదిలో ఉన్న ముగ్గురు గాఢనిద్రలో ఉన్నారు. ఈ కారణంగా మంటలు గది అంతా వ్యాపించే వరకు వారు నిద్ర లేవదు. దీంతో ఒక్కసారిగా మంటలు వారిని చుట్టుముట్టాయి. దాంతో గదిలో ఉన్న ముగ్గురు…
Pakistan: పాకిస్తాన్ రగిలిపోతుంది. భారత్ ఎదుగుదలను చూసి అక్కడి ప్రజలు అసూయ వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాలు కూడా ఒకేసారి స్వాతంత్య్రం పొందినా కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంటే.. పాకిస్తాన్ లో మాత్రం ప్రజాస్వామ్యం మాటున సైన్యం రాజ్యమేలుతోంది. చివరకు 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ కూడా ఆర్థికంగా ఎంతో ఎదిగింది. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదం, ఆర్థిక కష్టాలు, రాజకీయ అస్థిరత ఉంది. చివరకు ప్రజలకు నిత్యావసరాలు, కరెంట్, గ్యాస్ అందుబాటులో ఉండటం లేదు. ఒక…
G20 Summit: పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుకు అగ్రదేశం అమెరికా, భారత్ పావులు కదుపుతున్నాయి. రైల్, ఓడరేవుల మెగా డీల్పై అమెరికా, సౌదీ అరేబియా, భారత్, ఇతర దేశాలు చర్చలు జరుపుతున్నట్టు రాయిటర్స్ శుక్రవారం ప్రకటించింది. దీనిపై అమెరికన్ న్యూస్ లెటర్ ఆక్సియోస్ కథనాన్ని నివేదించింది.
యెమెన్ గుండా గల్ఫ్ రాజ్యంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ఇథియోపియన్ వలసదారులపై సౌదీ సరిహద్దు గార్డులు పేలుడు ఆయుధాలు ప్రయోగించారని, గత సంవత్సరం నుంచి వందల మందిని చంపారని హ్యూమన్ రైట్స్ వాచ్ సోమవారం తెలిపింది.