Saudi Arabia: 2023-24 విద్యాసంవత్సరానికి గానూ సౌదీ అరేబియా స్కూల్ బుక్స్ మ్యాపుల నుంచి పాలస్తీనా పేరును తొలగించారని వస్తున్న నివేదికలు చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయెలీ అనుకూల థింక్‌ట్యాంక్ IMPACT-se, స్కూల్ ఎడ్యుకేషన్‌లో శాంతి మరియు సాంస్కృతిక సహనం పర్యవేక్షణ సంస్థ విడుదల చేసిన నివేదిక ఈ విషయాలను పేర్కొంది. IMPACT-se 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 371 పాఠ్యపుస్తకాలను సమీక్షించింది. ప్రస్తుత పాఠ్యాంశాలు, గతంలో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నాయని తేలింది.
Read Also: OpenAI: భారత ఎన్నికల్ని ఏఐతో ప్రభావితం చేసే కుట్ర.. యాంటీ-బీజేపీ ఎజెండాతో ఇజ్రాయిల్ సంస్థ..
నివేదిక ప్రకారం.. 2023-24 సోషల్ అండ్ నేషనల్ స్టడీస్ పాఠ్యపుస్తకాల్లో సౌదీ అరేబియా మ్యాప్, దాని చుట్టుపక్కల ఉన్న దేశాల పేర్లలో పాలస్తీనా పేరు లేదు. 2022లోని పుస్తకాల్లో ఇది ఉంది. పాలస్తీనియన్లను బహిష్కరించే లక్ష్యంతో ‘‘జియోనిజాన్ని’’ జాత్యాహంకార యూరోపియన్ ఉద్యమంగా నిర్వచించే కంటెంట్‌ని తొలగించింది. అరబ్ విస్తరణకు జియోనిజాన్ని నిందించే కుట్ర సిద్ధాంతాలను, ఇజ్రాయిల్‌ని ‘‘ఇజ్రాయిల్ శత్రువు’’, ‘‘జియోనిస్ట్ ఎనిమి’’గా పేర్కొనడాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఏడాది పాఠ్యపుస్తకాల్లో జిహాద్‌కి సంబంధించిన హింసాత్మక వివరణలను తొలగించం లేదా మార్చినట్లు నివేదిక తెలియజేసింది.
మొత్తంగా 21 సమస్యాత్మ ఉదాహరణలు తీసివేయబడ్డాయి. వాటిల్లో చాలా వరకు ప్రస్తుతం రద్దు చేసిన పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి. శాంతి, సహనం వంటి యునెస్కో ప్రమాణాలను ఉల్లంఘించే కంటెంట్‌తో నిండిన పాలస్తీనా అధ్యాయాన్ని కలిగి ఉన్న సోషల్ స్టడీస్ హైస్కూల్ పాఠ్యపుస్తకం కూడా ఇందులో ఉందని నివేదిక చెబుతోంది. ఈ మార్పులు సౌదీ అరేబియా-ఇజ్రాయిల్ మధ్య బలపడుతున్న బంధాన్ని తెలియజేస్తోంది.