తిరుమలలో కోవిడ్ నిబంధనలు సామాన్య భక్తులుకేనా? VIPలకు లేని ఆంక్షలు వారికే ఎందుకు? ముక్కోటి ఏకాదశి మొదలుకొని.. మిగతా రోజులవరకు కోవిడ్ పేరుతో సామాన్యలు శ్రీవారి దర్శనానికి దూరం కావాల్సిందేనా? ఏడాదిన్నరగా సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి దూరం..!అఖిలాండకోటికి బ్రహ్మాండ నాయకుడైన ఏడుకొండలస్వామి దర్శనం కోసం ఎన్ని ప్రయాసలు ఎదురైనా ఆనందంగా భరిస్తారు భక్తులు. వారికి కావల్సిందల్లా.. శ్రీవారి దర్శనమే. అందుకే సామాన్య భక్తులకు ఎలాంటి ప్రణాళికలు.. సిఫారసులు ఉండవు. తమను గట్టెక్కించే స్వామివారు గుర్తుకొస్తే చాలు…
ఏడుకొండల వేంకటేశ్వర స్వామివారిని దర్శించేందుకు ఎక్కడెక్కడినుంచే భక్తులు వస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో శ్రీవారి దర్శానానికి ఆన్‌లైన్‌లో టికెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. అయితే తాజాగా జనవరి నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ ఈ రోజు ఉదయం 9 గంటలు విడుల చేసింది. అయితే హాట్ కేకుల్లా సర్వదర్శనం టోకెన్లు బుక్కాయ్యాయి. జనవరి నెలకు సంబంధించి 2.60 లక్షల టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. అయితే విడుదల చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే మొత్తం టొకెన్లు అన్ని…
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా గతంలో దర్శనాలు పరిమితం చేశారు. అందులోనూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తిరుమలకు వెళ్ళే దారుల్లో కొండచరియలు విరిగిపడడం, నడక దారి పాడవడంతో భక్తులు తగ్గారు. తిరుమలలో ఆదివారం భక్తులు బాగా పెరిగారు. ఆదివారం కావడం వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల భక్త జనసంద్రంగా మారింది. శ్రీవారిని 36162 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగిందనే చెప్పాలి.…
సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇప్పటికే ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించగా… ఈ నెల 24వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది.. దీనికి ఒక్కరోజు ముందుగా.. అంటే.. ఈ నెల 23వ తేదీన అక్టోబర్ మాసానికి సంబంధిచిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. ఇవి కూడా ఆన్‌లైన్ ద్వారా పొందే వీలుంది.. రోజుకి 8 వేల చొప్పున టిక్కెట్లును…
ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు విక్రయించేందుకు సిద్ధం అవుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. వారం రోజుల్లో ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారిని ప్రారంభిస్తామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈ నెల 18వ తేదీ నుంచి పెరటాసి మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆఫ్ లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు నిలిపివేసే యోచనలో ఉంది టీటీడీ.. టోకెన్ల కోసం తమిళ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం వుండడంతో కోవిడ్ నిబంధనలు అమలు చేయడం కష్టం అవుతుందని..…