సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇప్పటికే ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించగా… ఈ నెల 24వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది.. దీనికి ఒక్కరోజు ముందుగా.. అంటే.. ఈ నెల 23వ తేదీన అక్టోబర్ మాసానికి సంబంధిచిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. ఇవి కూడా ఆన్‌లైన్ ద్వారా పొందే వీలుంది.. రోజుకి 8 వేల చొప్పున టిక్కెట్లును విడుదల చేయనుంది టీటీడీ.. ఇక, ఈ నెల 24వ తేదీన ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీని ప్రారంభిస్తారు.. రోజుకి 8 వేల చొప్పున టోకెన్లు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా తిరుపతిలో ఇప్పటి వరకు ఆఫ్ లైన్‌లో జారీ చేస్తున్న సర్వదర్శన టోకెన్లును ఈ నెల 23వ తేదీ నుంచి నిలిపివేయనుంది టీటీడీ.