కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా గతంలో దర్శనాలు పరిమితం చేశారు. అందులోనూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తిరుమలకు వెళ్ళే దారుల్లో కొండచరియలు విరిగిపడడం, నడక దారి పాడవడంతో భక్తులు తగ్గారు. తిరుమలలో ఆదివారం భక్తులు బాగా పెరిగారు. ఆదివారం కావడం వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల భక్త జనసంద్రంగా మారింది. శ్రీవారిని 36162 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగిందనే చెప్పాలి. 16,642 మంది భక్తులు తలనీలాలిచ్చారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3.25 కోట్లుగా నమోదైంది.
మరోవైపు ఇవాళ ఆన్ లైన్ లో జనవరి మాసంకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు విడుదల చెయ్యనుంది టీటీడీ. ఉదయం 9 గంటలకు టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ. రోజుకి 10 వేల చొప్పున టికెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ. జనవరి 13 నుంచి 22 వ తేదీ వరకు రోజుకి 5 వేల చొప్పున టికెట్లు విడుదల చెయ్యనున్నట్టు టీటీడీ వెల్లడించింది. తిరుమల దర్శనానికి సంబంధించి గతంలో గంటల వ్యవధిలోనే లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.