తెలుగు సినీ పరిశ్రమలో ఓ మాదిరి పెద్ద సినిమాలు వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరా, బాలకృష్ణ అఖండ 2, పవన్ కళ్యాణ్ ఓజీ, ప్రభాస్ రాజా సాబ్ ఈ ఏడాదిలో రిలీజ్ కావలసిన మిగతా పెద్ద సినిమాలు. అయితే ఈ సినిమాల విడుదల తేదీల గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. Also Read: Rajamouli: జక్కన్నా.. ఇంకా చెక్కుతున్నావా?? నిజానికి విశ్వంభరా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి…
సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చింది.. ఈ సమయంలో ఆర్టీసీ ఆదాయం రూ.23 కోట్లు దాటినట్టు ఆ సంస్థ ప్రకటించింది.. పండు సమయంలో 7200 బస్సులతో మొదలుపెట్టి 9,097 బస్సులు నడిపింది ఏపీఎస్ఆర్టీసీ.. మొత్తం 23.71 కోట్ల సంక్రాంతి పండుగ సమయంలో ఆదాయాన్ని ఆర్జించింది ఏపీఎస్ఆర్టీసీ..
Sankranthiki Vasthunnam: సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, సినిమాలు ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ నేపథంలో అన్ని వర్గాల నుంచి సూపర్ టాక్ తెచ్చుకున్న సంక్రాంతికి వస్తున్నాం, దాకు మహారాజ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. సీనియర్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వసూళ్లను రాబడుతున్నారు. నువ్వా.. నేనా.. అన్నట్లుగా వసూళ్లను రాబడుతున్నారు ఈ సీనియర్ హీరోలు. ఇకపోతే, సీనియర్ హీరో…
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సంక్రాంతి సందర్భంగా సీఆర్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో యువకుల మధ్య మాట మాట వచ్చి చిన్న వివాదం చోటు చేసుకుంది.. అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీసింది..
Sankranthiki Vasthunam: 2025 సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. సినిమా విడుదలైన ప్రతిచోటా విజయవంతంగా దూసుకుపోతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ నిర్మించగా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్కు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రివ్యూస్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. జనవరి 14న విడుదలైనప్పటి నుంచి ఫ్యామిలీ అడియన్స్ నుంచి సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. చిత్రంలో విక్టరీ…
సంక్రాంతి పండగ పురస్కరించుకొని ఐదు రోజుల సెలవు అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పునః ప్రారంభమైంది. వరుస సెలవుల అనంతరం మార్కెట్ యార్డు తెరుచుకోవండతో.. తమ పంటలను విక్రయించేందుకు రైతులు భారీగా తరలివచ్చారు. వేల సంఖ్యలో పత్తి, మిర్చి బస్తాలతో మార్కెట్ కళకళలాడుతోంది. ముఖ్యంగా తెల్ల బంగారం భారీగా వచ్చింది. రైతులు భారీగా తరలిరావడంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ రోజు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సుమారు 5,000 బస్తాల మిర్చి…
సంక్రాంతి పండుగ సంబరాలు పల్లెల్లో అంబరాన్ని తాకాయి.. మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన భోగి, సంక్రాంతి, కనుమ పండగ ముగియడంతో.. తిరిగి పట్నం బాట పట్టారు జనం.. పండగకు ముందు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రహదారులు.. ముఖ్యంగా విజయవాడ హైవే రద్దీగా మారి.. ఎక్కడి కక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కాగా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.. పల్లెకు బైబై చెబుతూ పట్నం బాట పట్టారు..
Raja Saab Poster: ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ కామెడీ జోనర్ చిత్రం ప్రేక్షకులను వినోదంతో పాటు కొత్త అనుభవం అందించనుంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు కథానాయికలుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే సంక్రాంతి సందర్భంగా.. ‘రాజాసాబ్’ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను…
ఇవాళ నారావారిపల్లెలో బిజీబిజీగా గడపనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉదయం కులదైవం నాగాలమ్మను ముఖ్యమంత్రి కుటుంబం దర్శించుకోనుంది. ఆ తర్వాత సీఎం తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధులకు నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం.. బాలకృష్ణ చేతుల మీదుగా ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహావిష్కరించనున్నారు చంద్రబాబు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పండగ సందడిలో తెలుగు రాష్ట్రాల పల్లెలు శోభాయమానంగా మారాయని పేర్కొన్న ఆయన.. భారతీయులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.. పల్లె సౌభాగ్యమే... దేశ సౌభాగ్యం అని తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.