Raja Saab Poster: సంక్రాంతి స్పెషల్‌గా ‘రాజాసాబ్’ పోస్టర్ రిలీజ్
- సంక్రాంతి స్పెషల్‌గా ‘రాజాసాబ్’ కొత్త పోస్టర్ రిలీజ్.
- స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న ప్రభాస్.
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కొత్త పోస్టర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Saab Poster: ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ కామెడీ జోనర్ చిత్రం ప్రేక్షకులను వినోదంతో పాటు కొత్త అనుభవం అందించనుంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు కథానాయికలుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే సంక్రాంతి సందర్భంగా.. ‘రాజాసాబ్’ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ కళ్లద్దాలు పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న స్టైలిష్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ చిత్ర బృందం ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ పోస్టర్ ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలను మరింత పెంచింది.
Happy Sankranthi Darlings ❤️
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్తో పల్లా, నిమ్మల భేటీ
Manam yeppudu vasthe appude Asalaina Panduga….Twaralo Chithakkottedham 🔥#TheRajaSaab will meet you soon in theatres. pic.twitter.com/pVAW0nyTjI
— The RajaSaab (@rajasaabmovie) January 14, 2025
ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ, ఈ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని జపాన్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే జపానీస్ వెర్షన్‌లో ఓ ప్రత్యేక పాట చేయాలని చిత్ర బృందం తనను సంప్రదించినట్లు తెలిపారు. ఈ చిత్రంలో డ్యూయెట్ సాంగ్, స్పెషల్ సాంగ్, ముగ్గురు కథానాయికలతో ఓ పాట, అలాగే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటాయని తెలుస్తోంది. ‘రాజాసాబ్’ సినిమాపై అంచనాలు లేకుండా చూస్తే ప్రేక్షకులు ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని దర్శకుడు మారుతి ఇది వరకే చెప్పకనే చెప్పారు.
‘రాజాసాబ్’ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హారర్ కామెడీ జోనర్‌లో ప్రభాస్ వంటి స్టార్ నటుడితో రూపొందుతున్న ఈ సినిమా అభిమానులకు కొత్తగా ఉండబోతోందని అంచనా వేయవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాక, సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. ‘రాజాసాబ్’ ప్రభాస్ కెరీర్‌లో మరో పెద్ద హిట్‌గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!