ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాల సందడి నెలకొంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే కోడిపందాల సందడికి అన్ని ఏర్పాట్లు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు నిర్వాహకులు.. ఒకపక్క పోలీసుల అంచులు కొనసాగుతున్న నిర్వాహకులు పందెంబరులను అందంగా ముస్తాబు చేసే పనిలో పడ్డారు.
సంక్రాంతి పండగ వేళ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకపక్క పోలీసుల దాడులు కొనసాగుతున్నా.. మరొక పందెం నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తూనే ఉన్నారు. వేల సంఖ్యలో తరలివచ్చే జనం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ షామియానాలు, టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, పార్కింగ్ సౌకర్యాలతో కోడి పందాల బరులు సిద్ధమవుతున్నాయి. కోడి పందాలతో పాటు గుండాట, పేకాట నిర్వహణకు సైతం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి…
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రాపాక గ్రామంలో మహిళలు పిడకలతో బోగి మంటలకు శ్రీకారం చుడుతున్నారు. గ్రామ పూర్వికుల ఆచార సంప్రదాయం ప్రకారం.. ఇంటి నుండి కనీసం ఒక పిడకైనా ప్రతి ఏటా బోగి మంటకు సొంతంగా తయారు చేసుకుని వేయాలి. ప్రతి ఏటా బోగి సమయానికి గ్రామంలో ప్రతి ఒక్కరు 116 నుండి 1116 వరకు ప్రతి ఒక్కరు బోగి మంటల్లో పిడకలు వేయడం వారి సాంప్రదాయంగా మలుచుకున్నారు. ఇలా గ్రామంలో అలవాటుగా మారిన ఈ…
సంక్రాంతి పండగకు ఊరెళ్తున్నారా.. అయితే మీ పర్సును ఒకసారి చెక్ చేసుకోండి.. మీరెప్పుడూ చెల్లించే టికెట్ ఛార్జీలకు రెండింతలో.. లేక మూడింతలో చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవచ్చు. మీరెక్కుతున్నది బస్సే కానీ, విమాన ఛార్జీల స్థాయిలో సమర్పించుకోవాల్సిన పరిస్థితి మీకు ఎదురుకావచ్చు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. ముందుగానే తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మీడియాతో చిట్ చాట్‌లో ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆకాక్షించారు.. ఇక, పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలి అని సూచించారు.. నేను అందుకే మా ఊరికి ప్రతీ సంక్రాంతికి వెళ్తున్నాను అన్నారు.. సమాజంలో పై స్థాయిలో ఉన్నవారు దీనిని పాటిస్తే, మిగిలిన…
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది.. రెండు రోజుల ముందే నగరానికి పండుగ శోభ సంతరించుకుంది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వటంతో విజయవాడ మీదుగా భారీగా ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది.
సెంటిమెంటుని, పండుగల్ని దోచుకునే దందాలో ప్రైవేట్ ట్రావెల్స్ ముందుంటాయనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్న మాట! ఫెస్టివల్కి ఇంటికి వెళ్తున్నామన్న సంతోషమే ఉంచరు! పైసో, పరకో పట్టుకెళ్దామన్న ఆశను నిలువునా కూల్చేస్తారు. అడ్డగోలుగా దోచుకుంటారు. అసలు పండుగ వచ్చేది జనాలకు కాదు.. ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్‌కు! టికెట్ రేటు విషయంలో వాళ్ల నోటికి మొక్కాలి! పెంచే రేట్లకు పద్ధతీ పాడూ లేదు.
పందాల పండుగకు రంగం సిద్దమవుతుంది. నెలల తరబడి చంటిబిడ్డల్లా సాకిన పందెం పుంజులను బరిలో దించేందుకు ముహూర్తం దగ్గర పడటంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి అతిధులు ఇప్పటికే గ్రామాలకు చేరుకుంటున్నారు.. వీరితో పాటు పందాలపై మోజున్న జూదగాళ్ళంతా గోదావరి బాట పట్టారు. పెద్ద మొత్తంలో పందేలు కాసేందుకు సై అంటే సై అంటున్నారు.. ఇదే సమయంలో కూటమి నేతల మద్య పందాల నిర్వాహణ పోటి పెంచుతోంది.…
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. యూనివర్సిటీలో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలతో సందడి నెలకొంది. విద్యార్థులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. ఈ సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నటుడు మోహన్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేదికపై ఆయన మాట్లాడారు. గతం గతః అనే వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘గతం గతః. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను.…
Unstoppable S4: ఆహా వేదికగా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న “అన్‌స్టాపబుల్ షో” విజయవంతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్‌లో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నాలుగో సీజన్‌లో ఆరు ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఏడో ఎపిసోడ్లో ఏముంటుంది, ఎవరు రానున్నారు అన్న ఆసక్తి ఎక్కువగా నెలకొంది. అయితే, ఈసారి హీరో “విక్టరీ వెంకటేశ్”…