సౌతాఫ్రికా-భారత్ జట్ల మధ్య డర్బన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. మొదట టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. సౌతాఫ్రికా గడ్డపై చెలరేగుతున్నారు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ బరిలోకి దిగారు. అయితే.. బిగ్ షాట్ ఆడే క్రమంలో అభిషేక్ (7) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకోగా.. మరో ఓపెనర్ శాంసన్ అర్ధ సెంచరీతో చెలరేగారు. క్రీజులోకి దిగిన నుంచి శాంసన్ సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.
ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఫ్రాంఛైజీలకు ఇప్పటికే ఐపీఎల్ పాలక వర్గం అనుమతించింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఉంటుంది. రిటైన్ జాబితాను ప్రకటించడానికి అక్టోబర్ 31 తుది గడువు. రిటైన్ ప్లేయర్ల లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్నా.. ఇప్పటివరకు ఏ జట్టు కూడా అధికారికంగా జాబితాను విడుదల చేయలేదు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఆరుగురిని రిటైన్ చేసుకుందని…
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో తాను ఆడాల్సిందని, చివరి నిమిషంలో తుది జట్టు నుంచి తనను తప్పించారని టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తెలిపాడు. తుది జట్టు నుంచి తప్పించినందుకు కెప్టెన్ రోహిత్ శర్మ తనకు క్షమాపణలు చెప్పాడన్నాడు. తుది జట్టులో లేకపోవడంతో తాను కాస్త నిరాశకు గురయ్యానని, కానీ ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నో ఎదుర్కొన్నానని సంజూ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన సంజూ.. ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. రిషబ్ పంత్ జట్టులో…
Sanju Samson About Test Cricket: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. 47 బంతుల్లోనే 111 పరుగులు చేశాడు. 40 బంతుల్లోనే శతకం చేసి.. టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. సూపర్ సెంచరీ చేసిన సంజూపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తన బ్యాటింగ్‌తోనే విమర్శకుల నోళ్లను మూయించిన సంజూ.. తాజాగా తన మనసులోని మాటను…
శ్రీలంక టీ20 సిరీస్‌లో రెండు మ్యాచుల్లో డకౌట్ కావడంతో.. టీమిండియాలో మళ్లీ ఆడే అవకాశం వస్తుందని తాను అస్సలు ఊహించలేదని బ్యాటర్ సంజూ శాంసన్ అన్నాడు. తనపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలిపాడు. భారత జట్టులో ప్రతి స్థానానికి తీవ్రమైన పోటీ ఉందని, మంచి ప్రదర్శన చేస్తే జట్టులో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేం కాదని సంజూ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. 47 బంతుల్లోనే 111 పరుగులు…
భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ పూర్తవ్వగా.. టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 297 భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ.. సంజు శాంసన్ టీమ్ ఇండియాకు శుభారంభం అందించాడు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ పూర్తవ్వగా.. టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 297 భారీ స్కోర్ చేసింది.
బంగ్లాదేశ్‌పై భారత్‌కు గొప్ప ఆరంభం లభించింది. అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ.. అయితే సంజు శాంసన్ టీమ్ ఇండియాకు శుభారంభం అందించాడు. శాంసన్ సెంచరీ చేశాడు.
Sanju Samson Comes Opener in Gwalior T20: టెస్టుల్లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన భారత్ పొట్టి సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రాత్రి 7.30కు గ్వాలియర్‌లో మొదటి మ్యాచ్ ఆరంభం కానుంది. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కుర్రాళ్లు ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ లాంటి యువ ఆటగాళ్లకు సత్తా చాటడానికి ఈ సిరీస్ అవకాశం అనే చెప్పాలి. తొలి…
దులీప్ ట్రోఫీ 2024లో రెండో రౌండ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అనంతపురంలో ఇండియా సితో ఇండియా డి టీమ్ తలపడుతోంది. ఇండియా డి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిరాశపరిచాడు. 7 బంతులు ఎదుర్కొన్న శ్రేయాస్.. ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఆకిబ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. కెప్టెన్‌గా కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అతడు విఫలమవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఇలాగే ఆడితే భారత జట్టులోకి రావడం కష్టమే అని కామెంట్స్…