CSK vs Sanju Samson: సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్తున్నట్లు రోజుకో వార్త బయటకు వస్తుంది. అయితే, ఈ న్యూస్ ని ఎక్కడా కూడా అధికారికంగా ధ్రువీకరించలేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఈ వార్త వైరల్ అవుతుంది. కానీ, ఇందులో నిజం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ఆర్ఆర్ యాజమాన్యానికి తలనొప్పిగా మారాడా.. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ జట్టులోకి ఎంట్రీ ఇస్తే వైభవ్ ని పక్కన పెట్టేస్తారా.. ద్రవిడ్- సంజు శాంసన్ మధ్య విభేదాలను వైభవ్ పెంచుతున్నాడా.. ప్రస్తుతం క్రికెట్ కారిడార్‌లో వైభవ్ సూర్యవంశీ పేరు బాగా వినిపిస్తుంది.
రాజస్థాన్ రాయల్స్‌కు సంజు శాంసన్ జట్టు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతున్నారు. ఈ ఇద్దరి సాథ్యంలో టీం ఏడు మ్యాచ్‌లు ఆడి, కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో కింది నుంచి మూడో స్థానంలో ఉంది. అయితే.. రాజస్థాన్ రాయల్స్‌కు సంబంధించి ప్రస్తుతం ఓ టాపిక్ వైరల్‌గా మారుతోంది. రాహుల్ ద్రవిడ్, సంజు శాంసన్ మధ్య విభేదాలు ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్…
Sanju Samson vs Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ జట్టులో అంతర్గత పోరు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ సంజూ శాంసన్ల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
నేడు ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ లక్ష్యం 189 పరుగులు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ పోరెల్(49) అత్యధిక పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్(38), అక్షర్ పటేల్ (34), ట్రిస్టన్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-28లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు జట్టుకు రజత్ పటిదార్ నాయకత్వం వహిస్తుండగా.. రాజస్థాన్ కెప్టెన్‌గా సంజు శాంసన్ ఉన్నాడు.
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ 50 పరుగుల తేడాతో విజయం సాధించడంతో.. సంజూ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. ఈ క్రమంలో లెజెండరీ షేన్ వార్న్ రికార్డును బ్రేక్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూ శాంసన్ మొత్తం…
RR vs KKR : ఐపీఎల్ 2025లో భాగంగా నేడు జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ అనుకున్నంత ఉత్కంఠ రేకెత్తించలేదు. మ్యాచ్ ప్రారంభంలో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ టీం, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఎదురుదెబ్బ తిన్నది. అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ నుంచి పెద్ద స్కోర్ రావకపోవడం రాజస్థాన్ రాయల్స్‌ను దెబ్బతీసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 29 పరుగులతో తేలికపాటి…
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుకు షాక్ తగిలింది. కెప్టెన్ సంజు శాంసన్ ఈ ఎడిషన్‌లో రాజస్థాన్ ఆడే తొలి మూడు మ్యాచ్‌లకు సారథ్యం వహించడని ఆర్ఆర్ ఎక్స్ వేదికగా తెలిపింది. ఫిట్నెస్ సమస్య కారణంగా కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మాత్రమే ఆడతాడని పేర్కొంది. శాంసన్ స్థానంలో స్టార్ బ్యాటర్ రియాన్ పరాగ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ‘ఐపీఎల్ 2025లో సంజు శాంసన్ మొదటి మూడు మ్యాచ్‌లలో బ్యాటర్‌గా మాత్రమే ఆడతాడు. ఫిట్నెస్…