దక్షిణాఫ్రికా పర్యటనలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత జట్టును అద్భుతంగా నడిపించాడని టీమిండియా తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. సిరీస్ ఆసాంతం కుర్రాళ్లు ప్రదర్శించిన వ్యక్తిత్వం పట్ల తాను గర్వపడుతున్నా అని చెప్పారు. జట్టు ఆడిన తీరు, ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదించిన విధానం అద్భుతం అని హైదరాబాద్ సొగసరి చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను 3-1తో భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌తో బిజీగా…
దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు సాధించాడు. కాగా.. ఈ సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. నాల్గవ మ్యాచ్‌లో అజేయంగా 109 పరుగులు చేశాడు. దీంతో.. టీ20 ఫార్మాట్లో 2024లో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందున్న విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.
సంజూ శాంసన్, తిలక్ వర్మల అజేయ సెంచరీలతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 3-1తో దక్షిణాఫ్రికాను ఓడించింది. వాండరర్స్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో, భారత్ ఒక వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరును సాధించింది, ఆపై దక్షిణాఫ్రికాను 148 పరుగులకు ఆలౌట్ చేసి దక్షిణాఫ్రికాను 135 పరుగులకే ఆలౌట్ చేసింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు 135 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. టీ20 ఫార్మాట్లో టీమిండియా సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి. టీమ్ ఇండియా ఈ విజయంలో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశారు.
IND vs SA: నేడు టీ20 సిరీస్‌లో చివరిదైన నాలుగో మ్యాచ్‌లో భారత్ ఈరోజు (శుక్రవారం) దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. ఇప్పటికే రెండు విజయాలు సాధించినా.. బ్యాటింగ్‌లో టీమిండియా తడబడుతోంది.
ఐపీఎల్ 2024లో అదరగొట్టిన వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు టీ20 ప్రపంచకప్ 2024లో చోటు దక్కింది. మెగా టోర్నీకి ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ప్రపంచకప్ అనంతరం శ్రీలంక పర్యటనలో వచ్చిన రెండు అవకాశాలను వృథా చేసుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో సెంచరీ చేసిన సంజూ.. ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. సంజూ శాంసన్ దక్షిణాఫ్రికాపై తొలి మ్యాచ్‌లోనే శతకం బాదాడు.…
టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్స్ ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తన కొడుకు పదేళ్ల కెరీర్‌ను నాశనం చేశారని ఆరోపించారు. సంజూ నైపుణ్యాన్ని గుర్తించి జట్టులో అవకాశం ఇచ్చిన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లకు విశ్వనాథ్ ధన్యవాదాలు తెలిపారు. సంజూ ఎప్పుడూ రికార్డుల కోసం ఆడడని, కొందరు స్వార్థం కోసం ఆడుతారని చెప్పుకొచ్చారు. 2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి…
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. రెండో టీ20లో శాంసన్ సెంచరీ సాధిస్తే.. టీ20ల్లో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కుతాడు.
SA vs IND: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. డర్బన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఆడుతున్న టీమ్ ఇండియా స్కోరు బోర్డుపై 202 పరుగులు చేయగా ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు మొత్తం 141 పరుగులకే ఆలౌట్ అయింది.
సౌతాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 202 పరుగులు సాధించింది. సౌతాఫ్రికా ముందు 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచారు.