టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ మంగళవారం ముంబైలో జరిగిన 2025 సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్‌లో పాల్గొన్నాడు. టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సంజు అందుకున్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌లోని సవాళ్లను, గాయాలను, జట్టుకు దూరంగా ఉన్నప్పుడు పడిన భాధను పంచుకున్నాడు. సంజు చేసిన సంవత్సరాల పోరాటం.. దేశం పట్ల అతడికి ఉన్న అపారమైన అంకితభావంకు నిదర్శనం. తన 10 ఏళ్ల కెరీర్లో కేవలం 40 మ్యాచ్‌లు మాత్రమే ఆడానని…
ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా మరికొద్దిసేపట్లో భారత్, యూఏఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. వికెట్ చాలా ఫ్రెష్‌గా ఉందని, రెండో ఇన్నింగ్స్‌లో మంచు పడే అవకాశాలు ఉన్నాయని సూర్య చెప్పాడు. ఇక్కడ 3-4 మంచి ప్రాక్టీస్ సెషన్లు చేశామని చెప్పాడు. అయితే భారత తుది జట్టు అందరి అంచనాలకు బిన్నంగా ఉంది. ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు.…
మరికొన్ని గంటల్లో ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈరోజు రాత్రి ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ మొదలవనుంది. బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో యూఏఈతో భారత్ తలపడనుంది. ఆసియా కప్ ప్రారంభం నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వర్యంలో 8 మంది కెప్టెన్లు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పలు ప్రశ్నలకు జవాబిచ్చాడు. సంజూ శాంసన్‌పై ప్రశ్నకు సూర్య తనదైన శైలిలో రిప్లై…
India Playing XI vs UAE in Asia Cup 2025: మినీ కప్ ‘ఆసియా కప్’ 2025కి సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో (సెప్టెంబర్ 9) యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ ఆరంభం కానుంది. భారత కాలమానం ప్రకారం.. మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు ఆరంభం కానున్నాయి. టోర్నీ మొదటి మ్యాచ్‌లో హాంకాంగ్, అఫ్గానిస్థాన్ టీమ్స్ తలపడనున్నాయి. సెప్టెంబర్ 10న భారత్ తన మొదటి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది. మినీ కప్ కోసం…
ఆసియా కప్ T20 2025 కోసం భారత జట్టు శుక్రవారం దుబాయ్ చేరుకుంది. జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మాన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, హార్దిక్ పాండ్యా ICC అకాడమీ గ్రౌండ్లో కనిపించారు. అయితే, జట్టు రాక కంటే హార్దిక్ లుక్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఆసియా కప్ T20 సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 28 వరకు జరుగుతుంది. భారతదేశం సెప్టెంబర్ 10న UAEతో తన ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ 14న…
CSK Rejects Rajasthan Royals’ Proposal: రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)ను కెప్టెన్ సంజు శాంసన్ వదిలేసేందుకు సిద్ధమయ్యాడు. తనను విడుదల చేయాలంటూ ఇప్పటికే ప్రాంఛైజీని కోరాడు. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సంజును తీసుకునేందుకు సిద్ధంగా ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సంజు ట్రేడ్ కోసం ఆర్ఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సంజు బదిలీ కోసం పలు ఫ్రాంచైజీలను ఆర్ఆర్ యజమాని మనోజ్ బదాలె నేరుగా సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. సరైన వికెట్ కీపర్, బ్యాటర్ కోసం బదాలె చూస్తున్నాడట.…
ఐపీఎల్ 2026 కోసం మరికొద్ది రోజుల్లో ఆటగాళ్ల ట్రేడింగ్ ప్రక్రియ ఆరంభం కానుంది. ప్రస్తుతం సంజు శాంసన్, రవిచంద్రన్ అశ్విన్‌ల గురించే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను అశ్విన్, రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)ను శాంసన్ వదిలేసేందుకు సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి ‘కుట్టి స్టోరీస్’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఐపీఎల్ గురించి ఎలాంటి చర్చ జరగలేదు. తాజాగా సంజు శాంసన్ ట్రేడింగ్‌పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.…
Rajasthan Royals Captain Sanju Samson Trade or Auction Options in 2025: రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) యాజమాన్యం, కెప్టెన్ సంజు శాంసన్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో శాంసన్‌ను తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శాంసన్ ఆర్ఆర్ జట్టులోనే ఉంటాడా?, శాంసన్‌ను రాజస్థాన్ ఫ్రాంఛైజీ ట్రేడ్ చేస్తుందా?, వేలానికి విడుదల శాంసన్‌ను ఆర్ఆర్ రిలీజ్…
Asia Cup 2025 India Squad Update: 2025 ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరగనుంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభమై.. 28తో ముగుస్తుంది. ఆతిథ్య హక్కులు భారత్ దగ్గరే ఉన్నా.. గతంలో పాకిస్తాన్‌తో ఒప్పందంలో భాగంగా తటస్థ వేదిక యూఏఈలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగనుండగా.. అబుదాబి, దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. టోర్నీకి ఇంకా…