T20 World Cup 2026: అయ్యో అయ్యయ్యో సంజు శాంసన్.. ఇక అంతే సంగతులు, ఇషాన్‌కు ప్లేస్ ఫిక్స్!
- మార్పులు చేసుకునేందుకు జనవరి 31 వరకు అవకాశం
- అయ్యో అయ్యయ్యో సంజు శాంసన్
- వరల్డ్‌కప్ 2026లో ఓపెనర్‌గా ఎవరు ఆడుతారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. జట్టులో మార్పులు చేసుకునేందుకు జనవరి 31 వరకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత సెలెక్టర్ల ముందు ఓ కీలక ప్రశ్న నిలిచింది. అదే.. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించేది ఎవరు?. సంజు శాంసన్?, ఇషాన్ కిషన్?, శుభ్‌మన్ గిల్?.. ఈ ముగ్గురిలో ఓపెనర్‌గా ఎవరు ఆడుతారు?. ప్రస్తుత ఫామ్ చూస్తే.. ఓపెనర్‌గా ఇషాన్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గిల్ ఇప్పుడు జట్టులో లేకున్నా.. సంజు వరుస వైఫల్యాలు అతడికి చోటు దక్కేలా చేస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకున్నా.. ఆ మూడు విజయాల్లో సంజు శాంసన్ పాత్ర ఏమీ లేదు. మూడు టీ20ల్లో వరుసగా 10, 6, 0 పరుగులతో నిరాశ పరిచాడు. గువాహటిలో తొలి బంతికే ఆఫ్‌స్టంప్ ఎగిరిపోయింది. బ్యాక్ ఫుట్ నుంచి ఫ్లిక్ చేయబోయి పూర్తిగా మిస్ అయ్యాడు. గాయపడిన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. వరుసగా 8, 76, 28 పరుగులతో సత్తాచాటాడు. దాంతో టీ20 వరల్డ్‌కప్ 2026 ముందు సంజు ఫామ్ బీసీసీఐ సెలెక్షన్ చర్చల్లో ప్రధాన అంశంగా మారింది.
Also Read
- India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
- India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read: Abhishek Sharma: అదేం బ్యాటింగ్‌రా సామీ.. 10 బంతుల్లోనే 50 రన్స్ చేస్తాడు!
తిలక్ వర్మ ఫిట్‌నెస్ సాధించాడు కాబట్టి మూడో స్థానంలో ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఫామ్ లేమితో సతమతం అవుతున్న సంజు శాంసన్‌ను ప్లేయింగ్ 11లో ఉంచడం కష్టమే. అప్పుడు ఇషాన్ కిషన్ జట్టులో ఉండడం ఖాయం. అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ ఓపెనింగ్ చేస్తాడు. ఇషాన్ వికెట్ కీపర్ కూడా కావడం అతడికి కలిసొచ్చే అంశం. సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్‌కు వచ్చాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా నాలుగో స్థానంలో ఆడుతాడు. ఆపై హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివమ్ దూబేలు ఆడుతారు. ఫామ్ పరంగా చూసుకుంటే.. శుభ్‌మన్ గిల్ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే. సంజు జట్టులో ఉన్నా.. ఇషాన్ ఓపెనింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎటు చూసుకున్నా.. న్యూజిలాండ్ టీ20 సిరీస్ సంజుకు నిరాశ కలిగించింది. అంతేకాదు ఇక సంజు పని అయిపోయినట్లే అని కూడా ఫాన్స్ అంటున్నారు. చూడాలి మరి సంజు పరిస్థితి ఎలా ఉండనుందో.
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!