Abhishek Sharma: ఫిట్‌నెస్ లేకున్నా.. ఆ భయంతోనే అభిషేక్ శర్మను ఆడిస్తున్నారా?
- నమీబియాపై 8 బంతుల్లో 22 పరుగులు
- కట్ చేస్తే పాకిస్థాన్ మ్యాచ్‌కు సంజూ దూరం
- అందుకే అభిషేక్ శర్మను ఆడిస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్ 2026లో చోటుచేసుకున్న కొన్ని టీమ్ ఎంపికల నిర్ణయాలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా సంజూ శాంసన్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా అవకాశం దక్కించుకున్న సంజూ.. నమీబియాపై కేవలం 8 బంతుల్లో 22 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ అనంతరం అతడు జట్టుకు దూరమయ్యాడు. పాకిస్థాన్ మ్యాచ్‌లో సంజూ బాగా ఆడితే.. అభిషేక్ పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచన మేనేజ్‌మెంట్‌లో మెదిలినట్లు చర్చ సాగుతోంది.
సంజూ శాంసన్ పాకిస్థాన్ మ్యాచ్‌లో కూడా రాణిస్తే.. అతడిని డ్రాప్ చేయడం కష్టమవుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావించిందట. అందుకే పూర్తిగా ఫిట్ కాకపోయినా అభిషేక్ శర్మనే పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై ఆడించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆ రెండు మ్యాచ్‌ల్లో అభిషేక్ డకౌట్ కావడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. ఇప్పుడు అతడిపై ట్రోల్స్ వస్తున్నాయి. ‘డకౌట్ స్టార్’ అని ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజెన్స్ పోస్టులు చేస్తున్నారు. ఫిట్‌నెస్ లేని అభిషేక్ ఆడడం చూస్తుంటే.. కావాలనే సంజూను పక్కనపెట్టినట్లు అర్ధమవుతోంది.
Also Read
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
- 2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
Also Read: Global Cricket Leagues: ప్రపంచ క్రికెట్‌లో కొత్త ట్రెండ్.. ఇక పాక్ ఆటగాళ్లకు బీపీఎల్ ఒక్కటే దిక్కు!
ఇలాంటి పరిస్థితి గతంలో శుభ్‌మన్ గిల్ విషయంలో కూడా ఎదురైంది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ అతడిని వరుసగా ఆడించగా.. ఆశించిన ఫలితాలు రాలేదు. చివరకు అతడిని తప్పించాల్సి వచ్చింది. తర్వాతే ఇతరులకు అవకాశాలు లభించాయి. ఈ రెండు సంఘటనలు జట్టు ఎంపికలో ఫిట్‌నెస్ ఎంత కీలకమో స్పష్టం చేస్తున్నాయి. గాయాలు లేదా అనారోగ్యంతో బాధపడుతున్న ఆటగాళ్లను బలవంతంగా ఆడించడం తాత్కాలికంగా సరైన నిర్ణయం అనిపించినా.. దీర్ఘకాలంలో అది ఆటగాడికీ జట్టుకీ నష్టమే అని చెప్పొచ్చు. సరైన సమయంలో సరైన ఆటగాడికి అవకాశం ఇవ్వడం టీమ్ బ్యాలెన్స్‌కు అత్యంత ముఖ్యం అని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?