ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 15 సంవత్సరాలు పోరాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్‌ఎస్ అని సీఎం తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఉన్న తెలంగాణను ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలిపారని.. 58 ఏళ్ళు ఎన్నో గోసలు పడ్డామన్నారు.
Rahul Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. తెలంగాణ కోసం ఒకరి తర్వాత ఒకరు జాతీయ నాయకుల క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇవాళ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
Babu Mohan Emotional: కొడుకు పార్టీ మారడంపై బీజేపీ అభ్యర్థి, సినీ నటుడు బాబు మోహన్ కంటతడి పెట్టుకున్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తండ్రికొడుకులను విడదీసిందని ఆరోపించారు. తన పేరును బీఆర్ఎస్ రాజకీయంగా దుర్వినియోగం చేసి.. కుట్రతో గెలవాలని చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తన కొడుకు పేరు ఉదయ్ భాస్కర్ అయితే.. ఉదయ్ బాబు మోహన్ అని ప్రచారంలో చెబుతున్నారని తెలిపారు. సిద్దిపేటకు…
సంగారెడ్డి జిల్లాలో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక చెట్టుకి పన్ను రద్దు చేశామని చెప్పారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపు అంశం అన్నీ పార్టీల్లోనూ అగ్గి రాజేసింది. ఇక కాంగ్రెస్లో మూడు జాబితా నేతల్లో ఉన్న అసంతృప్తిని బయటపెట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, పటాన్చెరులలో సీట్ల కేటాయింపు విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు.
తెలంగాణలో ప్రజల ప్రభుత్వం వచ్చినప్పుడే ప్రజల కలలు నిజమవుతాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పినట్టు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ధర్మ యుద్ధమే ఈ ఎన్నికలు అంటూ ఆయన పేర్కొన్నారు. ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో సీఎల్పీ భట్టి విక్రమార్క ప్రసంగించారు.
మిస్టర్ నడ్డా తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అంటూ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫేక్ సర్వేలు పెడుతుంది.. బీజేపీ జాకీ పెట్టిన తెలంగాణలో లేవదు.. కాంగ్రెస్ గెలవదు అని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ దెబ్బకు బిజెపి డక్ ఔట్..కాంగ్రెస్ రన్ ఔట్..కేసీఆర్ సెంచరీ చేయడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాల్లో అభ్యర్థులే లేరు.. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చుడే ఎక్కువ.
BJP Meeting: సంగారెడ్డిలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పులిమామిడి రాజు కమలం పార్టీలో జాయిన్ అయ్యారు.
ఈ రోజు జరిగే బహిరంగ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తదితరులు హాజరవుతారని, వారి సమక్షంలో బీజేపీలో చేరుతానని సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పులిమామిడి రాజు చెప్పారు.