Patancheruvu: సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో అతిపెద్ద ఔట్ లెట్ మాల్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ను సినీ హీరో బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రీటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటోంది అని అన్నారు. వర్తక, వాణిజ్యాలలో సుదూర దృష్టి కలిగిన పి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజమౌళి, టి.ప్రసాదరావు, దివంగత పి.సత్య నారాయణ క్రియాశీలక సారథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Anasuya : చీరలో నడుము అందాలతో హీటేక్కిస్తున్న అనసూయ.. ఆ చూపులకే మెల్ట్ అయిపోతారు..
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా ఏర్పాటు చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి బీజం వేసింది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటూ చెప్పుకొచ్చాడు. సైబరాబాద్ సిటీ, హైటెక్ సిటీలని అభివృద్ధి చేశాడు.. ప్రపంచంలో ఉన్న పారిశ్రామిక వేత్తలను, టూరిస్టులను ఆకర్శించేలా చంద్రబాబు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాడు.. అభివృద్ధికి బీజం పడితే ఆగేది కాదు ఇది అన్ స్టాపబుల్ అంటూ సినీ హీరో నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.