Reactor Blast in Sangareddy: సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో ఉన్న సీఎంహెచ్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. అదే సమయంలో పరిశ్రమలో 15 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఆ పరిశ్రమతో పాటు పక్కనే ఉన్న వనమాలి ఫార్మా పరిశ్రమకు కూడా మంటలు వ్యాపించడంతో రెండు పరిశ్రమల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో పరిశ్రమలో పనిచేస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఇస్నాపూర్‌లోని కాకతీయ ఆస్పత్రికి, పటాన్‌చెరులోని పోలార్ ఆస్పత్రికి తరలించారు.
Read also: KTR Vs Rajagopal Reddy: అహంకారం తగ్గించుకో.. కేటీఆర్ పై రాజగోపాల్ రెడ్డి ఫైర్
రియాక్టర్ పేలుడు సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే స్పందించి ఘటనాస్థలికి చేరుకున్నారు. రెండు కర్మాగారాల్లో మంటలు వ్యాపించడంతో సీనియర్ అగ్నిమాపక అధికారుల ఆదేశాల మేరకు పటాన్‌చెరు, సంగారెడ్డి, సదాశివపేట, బీహెచ్‌ఈఎల్ నుంచి అగ్నిమాపక యంత్రాలను పంపించారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను అదుపు చేసేందుకు సహకరించిన కార్మికులు రసాయనాలు పీల్చి అస్వస్థతకు గురయ్యారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారిని మోతు మాలిక్, దత్తు కులకర్ణి, కాలేషా పఠాన్, గోయదరావత్‌లుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఆర్డీఓ రవీందర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదంపై ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Telangana Assembly: సచ్చినా పామును మళ్ళీ చంపుతాడా ఎవడన్నా.. కేసీఆర్ పై రేవంత్