రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఇబ్బందుల నేపథ్యంలో కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.. ఇసుక లభ్యత, పారదర్శకంగా సరఫరా, అక్రమాల నియంత్రణ వంటి అంశాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా.. ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇసుక అక్రమాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇసుక అక్రమ తవ్వకాలకు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు కేంద్రంగా మారింది. అనిగండ్లపాడు రీచ్ వద్ద ఇసుక మాఫీయా హల్చల్ చేసింది. గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపు నుంచి ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నాయి. అన్నిండ్లపాడు గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపులో ఇసుక తీసుకెళ్తున్న లారీలను రైతులు…
మద్యం షాపుల్లో ఎవరైనా ఎంఆర్‌పీ ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో మద్యం ధరలు, ఇసుక లభ్యత, సరఫరాపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
నెల్లూరు నగర శివారులలోని పెన్నా నదిలో ఇసుక రీచ్‌లను అధికారులతో కలిసి మంత్రి డా. పొంగూరు నారాయణ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌ల్లో యంత్రాలతో తవ్వినా, అక్రమ రవాణా చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ఉచిత ఇసుకపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉచిత ఇసుకపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుకను ఉచితంగా అందించడమే లక్ష్యంగా సీనరేజీ రద్దు చేశామన్నారు. సొంత అవసరాలకు గ్రామ పంచాయతీల పరిధిలో మాత్రమే ట్రాక్టర్లతో ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చామన్నారు.
ఇసుక, లిక్కర్ పాలసీపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్ పాలసీల్లో ఎవరు వేలు పెట్టడానికి లేదు.. ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని అన్నారు. ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లతో ఇసుక తీసుకెళ్లే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు.. ఎడ్లబండితో ఇసుక తీసుకువెళ్లే వారిపై గ్రామాల్లో రైతులు మీద పెత్తనం చేయొద్దని సీఎం సూచించారు.
రానున్న వేసవి కాలంలో నెలకొనే ఇసుక డిమాండ్కు అనుగుణంగా లభ్యత పెంపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వాణిజ్యపన్నుల శాఖ ఛీఫ్ కమీషనర్, అబ్కారీ, భూగర్భ, గనుల శాఖ ముఖ్య కార్యాదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఉచిత ఇసుక పాలసీ 2024 జులై 8 నుండి అమలులోకి తీసుకురాగా.. స్టాక్‌యార్డ్‌ల వద్ద 4.8 లక్షలు, డి-సిల్టేషన్ పాయింట్లు వద్ద 54 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రస్తుతం సిద్దంగా ఉందన్నారు.
ఇవాళ్టి నుంచి ఏపీలో ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమల్లోకి రాబోతోంది.. ఉచిత ఇసుక పోర్టల్‌ను ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.. అధికారులు నుంచి ఇసుక రవాణాదారుల ఎవ్వరూ తప్పిదాలకు పాల్పడకుండా పోర్టల్ రూపకల్పనకు పూనుకుంది సర్కార్.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. తన అనుచరులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. నియోజకవర్గంలో 25 మంది ఇసుక రవాణా చేస్తున్నారు.. వారు వెంటనే పద్దతి మార్చుకోవాలి.. ఇసుక తరలింపు నిలిపివేయాలని స్పష్టం చేశారు. గతంలో ఇసుక అక్రమరవాణా అరికట్టేందుకు ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని గుర్తుచేసుకున్న ఆయన.. నా కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు. ఇసుక అక్రమ రవాణా చేసి నాకు దూరం కావద్దు అంటూ స్వీట్…